బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 68 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ప్రేరణ మెగా చీఫ్ అయిన వెంటనే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గురించి చెప్పారు బిగ్ బాస్. ఈ సీజన్‌లో ఎవిక్షన్ షీల్డ్ గెలిచి.. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా సేవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది.. ఎవిక్షన్ షీల్డ్ చాలా పవర్ ఫుల్.. ఇది మీకు రావాలంటే మీ మిత్రులు, శత్రువుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. పాము తన ఆకలిని తీర్చడానికి మీ దగ్గరున్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుంది.. అలా ఎవరి గోల్డెన్ ఎగ్ పాము తినేస్తుందో వాళ్లు రేస్ నుంచి తప్పుకున్నట్లు.. తినకుండా మిగిలిన చివరి సభ్యుడికే షీల్డ్ దక్కుతుంది అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
మెగా చీఫ్ ప్రేరణకి ఓ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. మెగా చీఫ్ అయిన కారణంగా మీ ప్రకారం ఇంట్లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ రాకూడదనుకుంటున్న ఐదుగురు సభ్యుల ఎగ్స్ పాము నోటిలో వేయండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో విష్ణుప్రియ,గంగవ్వ, పృథ్వీ, గౌతమ్ వేసింది. ఇక చివరి ఎగ్ కోసం చాలా ఆలోచించి హరితేజ ఎగ్ వేసింది. కొద్దిసేపటి తర్వాత స్నేక్ రాజా..అవినాష్-నబీల్ ఇద్దరినీ పిలిచాడు. నాకు ఆకలిగా ఉంది.. మిగిలిన ఎగ్స్ నుంచి ఒక ఎగ్‌ను నాకు పెట్టండి.. అంటూ అడిగాడు. దీంతో మన ఎగ్స్ మనం తీసుకోవాలని అనుకోం కదా.. నాకు అయితే యష్మీని తీసేయాలని ఉంది.. ఎందుకంటే నేను బ్రీఫ్‌కేసు ఇచ్చినా కూడా మెగా చీఫ టాస్కులో నన్ను ఓడించేందుకు ట్రై చేసింది అంటూ నబీల్ చెప్పాడు. ఇద్దరూ కలిసి యష్మీని తీసేశారు.
తర్వాత గౌతమ్-నిఖిల్ ఇద్దరినీ పిలిచి ఒక ఎగ్గు వేయండి అంటూ స్నేక్ రాజా చెప్పగా ప్రేరణను తీసేద్దామని గౌతమ్ అన్నాడు. కానీ దీనికి నిఖిల్ ఒప్పుకోలేదు. ప్రేరణ నామినేషన్స్‌లో ఉంది.. అంతగా కావాలంటే నాది నేనే త్యాగం చేస్తా.. నాకు ఇది వద్దు అంటూ నిఖిల్ అన్నాడు. మొత్తానికి నిఖిల్ తన ఎగ్ తీసేశాడు. ఇలా ఒక్కొక్కరిని పిలిచి ఎగ్ అడిగాడు. ఆ తర్వాత రోహిణి- హరితేజను పిలిచినప్పుడు వారిద్దరూ ఎవరి ఎగ్ వేయాలో తేల్చుకోలేకపోవడంతో స్నేక్ రాజాకు కోపం వచ్చింది. త్వరగా నా ఆకలి తీర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. సారీ చెప్పి అవినాష్ ఎగ్ వేసేసింది రోహిణి. చివరిగా నబీల్, నిఖిల్, రోహిణి ఎగ్స్ మాత్రమే అక్కడ మిగిలాయి. ఇలా అందరి ఎగ్స్ కంప్లీట్ అయి చివరికి నబీల్ ఎగ్ మిగిలింది. దీంతో షీల్డ్ తీసుకెళ్లి నబీల్ చేతిలో పెట్టారు.
Also Read:గురుకులాల్లో బర్త్ డే వేడుకలా?