Bigg Boss 8 Telugu: బూతులతో రెచ్చిపోయిన పృథ్వి

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నాగ్ ఇచ్చిన వార్నింగ్‌ను కూడా లెక్కచేయకుండా బూతులతో రెచ్చిపోయాడు. తొలుత హౌస్‌లో బెలూన్ టాస్క్‌ల గురించి రచ్చరచ్చ అయింది. సోనియా నిర్ణయం తప్పంటూ మరోసారి వాదించింది యష్మీ. దీంతో కోపం వచ్చిన నిఖిల్‌..యష్మీపై ఫైర్ అయ్యాడు. నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ యష్మీ కూడా రివర్స్ అయింది. ఈ గొడవతో మొత్తంగా ఇక నుండి ఏ టీమ్ పని వాళ్ల టీమ్ వాళ్లే చేసుకోవాలని అభయ్ తన టీం సభ్యులకు చెప్పాడు.

తనకు ఆకలి వేయడంతో కిచెన్‌లోకి వచ్చింది విష్ణుప్రియ. సరే దోస వేసి ఇస్తానంటూ మణికంఠ స్టవ్ దగ్గరికి రాగానే ప్రేరణ వెంటనే ఆ పిండి లాక్కొని ఫస్ట్ మన టీమ్‌కి.. తర్వాతే ఎవరైనా అంటూ మణికంఠతో కోపంగా అంది. దీంతో కోపంగా ఓ దోశ వేసి విష్ణు ప్రియకు ఇచ్చింది. అయితే ప్రేరణ వేసిన దోశ తినకుండా కేవలం మణి వేసిన దోశ మాత్రమే తిన్నది విష్ణు. ఈ క్రమంలో ప్రేరణ తన పట్ల ప్రవర్తించిన తీరుతో తెగ బాధపడింది విష్ణు.

ఈ విషయాన్ని అందరి ముందు తీసుకెళ్లి పంచాయతీ పెట్టడంతో ప్రేరణ కోపం గలేదు. ఈ క్రమంలో ఇద్దరూ తిట్టుకోగా తర్వాత సోనియా ఎంటరై సర్ది చెప్పడంతో తన చేతితో దోస వేసి విష్ణుప్రియకి తినిపించింది ప్రేరణ. ఆ తర్వాత కూడా మణిపై నోరు పారేసుకుంది ప్రేరణ. నువ్వు ఎంత వరస్ట్ ఫెలోవో తెలుస్తుంది.. నీ వల్లే ఇష్యూ పెద్దదైంది.. పోరా.. పోరా.. ఏమైనా చేసుకో పో.. అంటూ మణికంఠను తిట్టేసింది.

తర్వాత శక్తి (నిఖిల్) టీమ్ ఎక్కువ టాస్కులు గెలవడంతో వాళ్లకి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో శక్తి టీమ్‌కి నాన్ వెజిటేరియన్ గట్టిగానే దొరికింది. ఆ తర్వాత కిచెన్‌లో వంట విషయంలో కొత్త రూల్ పెట్టాడు బిగ్‌బాస్. వారం మొత్తంలో ఇక కేవలం 14 గంటలే కిచెన్ ఓపెన్‌లో ఉంటుందంటూ చెప్పాడు. ఎన్నిసార్లు వాడుకున్నా సరే 14 గంటలు అయిపోతే ఆ వారం ఇక నో కిచెన్ అని రూల్ పెట్టాడు.

తర్వాత గుడ్ల టాస్క్‌లో కొట్లాట రచ్చరచ్చగా మారింది. హౌస్‌లోకి ప్రభావతి (కోడి) 2.0 ఎంట్రీ ఇచ్చిం అప్పుడప్పుడు గుడ్లను పంపిస్తాను.. వాటిని జాగ్రత్తగా కాపాడాలి..ఏ టీమ్ అయితే ఎక్కువ గుడ్లు తిరిగి ఇస్తారో వాళ్లకి కొన్ని ప్రయోజనాల లభిస్తాయి అని చెప్పింది ప్రభావతి. దీంతో బుట్టలు పట్టుకొని రెడీ అయిపోయాయి రెండు టీమ్‌లు. టాస్క్ మొదలు కాగానే మణి ఒక్కొక్కరినీ విసిరి పారేశాడు. పృథ్వీని ఆపడానికి నబీల్, అభయ్, ఆదిత్య ముగ్గురూ ట్రై చేశారు.

గేమ్ మధ్యలో బ్రేక్ రావడంతో పృథ్వీపై రెచ్చిపోయాడు అభయ్. లఫూట్ గేమ్.. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనికిమాలిన గేమ్ స్టార్ట్ చేసింది వాడే.. వాడు ఎవడిదైనా పానం పోయినా ఆగడు అంటూ మండిపడ్డాడు. మళ్లీ గేమ్ మొదలవ్వగానే అభయ్ టీమ్ దాచుకున్న గుడ్లను లాగేందుకు ట్రై చేశాడు పృథ్వీ. దీంతో వార్నింగా నా బొక్కా అంటూ బూతులు తిట్టాడు. శనివారం నాగార్జున వార్నింగ్ ఇచ్చినా తగ్గలేదు పృథ్వీ. గేమ్ ఈరోజు ముగిసేసరికి శక్తి టీమ్ దగ్గర 66 గుడ్లు ఉండగా కాంతార టీమ్ 34 మాత్రమే దాచింది. దీంతో కాంతార టీమ్ నుంచి ఒక సభ్యుడిని తప్పించే పవర్ శక్తి టీమ్‌కి ఇచ్చాడు బిగ్‌బాస్. బాగా ఆడుతున్న నబీల్‌ను తప్పించారు శక్తి టీమ్. దీంతో నబీల్‌ను ఈ గేమ్‌కి సంచాలక్‌గా చేశాడు బిగ్‌బాస్.

Also Read:Bigg Boss 8 Telugu: కిస్‌లు, హాగ్‌లతో రచ్చ

- Advertisement -