bigg boss 7 telugu:7వ వారం మహిళనే ఎలిమినేటా!

52
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 48 రోజులు పూర్తిచేసుకుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్లో 7 గురు గౌతమ్ కృష్ణ,అమర్ దీప్,పల్లవి ప్రశాంత్,అశ్విని శ్రీ,భోలే షావలి,పూజా మూర్తి,టేస్టీ తేజా ఉండగా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నవారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ వారం కూడా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న అభ్యర్థి ఎలిమినేట్ కానుండగా పూజాకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుస్తోంది. ఇదే జరిగితే 7వ వారం కూడా హౌస్ నుండి అమ్మాయే ఎలిమినేట్ అవుతుంది.

ఓటింగ్‌లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్‌లకు ఎక్కువ ఓట్లు పడగా భోలే షావలి టాప్ 3లో ఓటింగ్ సాధించాడు. అయితే అందరికంటే లీస్ట్ ఓటింగ్ సాధించిన పూజా మూర్తి డోవారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుంది.

ఫస్ట్ వీక్‌లో కిరణ్ రాథోడ్,రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడోవారం కూడా మహిళనే ఎలిమినేట్ అయితే ఇప్పటి వరకూ ఏ బిగ్ బాస్ సీజన్‌లోనూ వరుసగా ఏడుగురు మహిళా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయింది లేదు.

Also Read:KTR:119 స్థానాల్లో ఈటల పోటీ చేస్తారా?

- Advertisement -