బిగ్ బాస్ 7 : ప్చ్.. చివర్లో కూడా వదల్లేదు

38
- Advertisement -

బిగ్‌ బాస్‌ హౌస్ లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడు. ఐతే, బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు గౌతమ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది, ఎవరికి మాస్క్‌ లేదు అనేది చెప్పాలని గౌతమ్‌ ను నాగార్జున కోరడం, దానికి గౌతమ్ తన పగను వ్యక్తపరచడానికి ఈ అవకాశాన్ని వాడుకోవడం జరిగిపోయాయి. ఇంతకీ, హౌస్ మేట్స్ గురించి గౌతమ్ ఏం మాట్లాడాడు అంటే..

ముందుగా శోభాశెట్టి గురించి : శోభా నువ్వు గేమ్‌ పై పోకస్‌ చేయి. ఇక నీకు అప్పుడప్పుడు మాస్క్‌ వస్తుంది అని చెప్పాడు. నిజానికి శోభాకి గౌతమ్ కి ముందు నుంచి సఖ్యత లేదు. అందుకే, ఆమెకు మాస్క్ ఉంది అని గౌతమ్ తన పగను చూపించాడు.

ఇక యావర్‌ విషయానికి వస్తే : బాగా ఆడు. నీకు మాస్క్‌ లేదు అని చెప్పాడు. కానీ, ప్రశాంత్‌ తో మాత్రం.. నువ్వు శివాజీ అన్నను కొట్టి, పైకి రావాలి అని చెప్పడమే బాగాలేదు. మొదటి నుంచి గౌతమ్, శివాజీ పై పగను పెంచుకున్నాడు. ప్రతి వారం శివాజీనే నామినేట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వెళ్ళిపోతూ కూడా శివాజీ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. పైగా శివాజీకి చిన్న మాస్క్‌ ఉంది అని క్లారిటీ ఇచ్చాడు.

అర్జున్‌ గురించి మాట్లాడుతూ.. అర్జున్ కి మాస్క్‌ లేదు. ఐతే, అమర్‌ కి మాత్రం మాస్క్‌ వచ్చి పోతుంటుంది అని, ఇక ప్రియాంక కు నో మాస్క్‌ అని, ఆమెను ఫైనల్‌లో చూడాలి అనుకుంటున్నాను అని గౌతమ్‌ చెప్పాడు. మొత్తానికి గౌతమ్ చివర్లో కూడా శివాజీని వదిలిపెట్టలేదు. అన్నట్టు బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షల కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి విజేత ఎవరో చూడాలి.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -