Bigg Boss 7 Telugu:డబుల్ ఎలిమినేషన్..ఇందులోనూ ట్విస్టే!

34
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. 5వ వారంలో భాగంగా ఇంటి నుండి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. శుభశ్రీ, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కాగా ఇందులో గౌతమ్‌ని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఇక ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఈ సారి ఎవరు ఊహించని విధంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను దింపారు. అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని శ్రీతో పాటు సీరియల్ నటి పూజా మూర్తి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న టేస్టీ తేజ,శివాజీ, శుభ శ్రీ,గౌతమ్ కృష్ణ,ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్ దీప్‌లు ఉండగా అందరిని చీకటి గదిలోకి పంపి ఎలిమినేట్ అయిన వాళ్లు బయటకు వస్తారని చెప్పారు నాగ్. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న శుభ శ్రీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగా బయటకు వచ్చిన ఆమె అందరితో నవ్వుతూ మాట్లాడింది. ఇక ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ అని ప్రకటించి గౌతమ్ కృష్ణను హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న టేస్టీ తేజ, గౌతమ్ మధ్య ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోగా తేజకు ఆరుగురు ఓటేశారు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన గౌతమ్..తన ఎలిమినేషన్‌ను అస్సలు ఊహిచంలేదన్నారు.టాస్క్‌లో బాగా ఆడతానని చెబుతూనే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం చూస్తుంటే అంతా సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటున్నారని అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరిలోనూ మరో కోణం ఉందని గౌతమ్ చెప్పుకొచ్చాడు.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:బెల్లంపల్లిలో బి‌ఆర్‌ఎస్ కు తిరుగులేదా!

- Advertisement -