బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 68 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఫ్యామిలీ వీక్ కంటిన్యూ కాగా ఇక ఈ ఎపిసోడ్‌లో శివాజీ – వర్సెస్ అర్జున్ గొడవ మాములుగా లేదు. ఇద్దరు నిజంగానే గొడవ పడుతున్నట్లు జీవించేశారు.హౌస్‌కి కెప్టెన్ అయిప శోభాశెట్టి .. ప్రియాంక, అమర్‌లను అసిస్టెంట్‌లుగా పెట్టుకుంది. దీంతో ఈవారం మొత్తం హౌస్‌కి ముగ్గురూ కెప్టెన్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రియాంక పొద్దుపొద్దున్నే గిన్నెలు ఎందుకు క్లీన్ చేయలేదంటూ యావర్‌తో గొడవకు దిగింది. దీంతో మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది.
తర్వాత లింగి లింగి లింగి లింగిడీ సాంగ్ వేయగా రతిక తండ్రి రాములు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రిని చూడగానే రతిక పరుగు పరుగున వెళ్లి తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. అనంతరం రాములు అందరిని ఆప్యాయంగా పలకరించాడు. మంచిగానే ఆడుతున్నావ్ బిడ్డా.. ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెప్పాడు. భోలే అన్నం కలుపుకుని వచ్చి.. రాములుకి ఆప్యాయంగా తినిపించాడు. రాములు ఇంటి నుంచి వెళ్లే టైం ఆసన్నం కావడంతో ఒక్క తీన్ మాస్ స్టెప్ అని బిగ్ బాస్‌ని అడిగి మరీ సాంగ్ వేయించుకున్నారు. డీజే టిల్లు సాంగ్ వేయడంతో.. రతిక, రాములు కలిసి స్టెప్‌లు వేశారు.
ఇక హౌస్‌లో ఫన్ కోసం.. శివాజీ-అర్జున్‌లు ప్రశాంత్-సందీప్‌ల మధ్య జరిగిన గొడవను రీ క్రియేట్ చేసి అదరగొట్టేశారు. పల్లవి ప్రశాంత్‌లా అర్జున్ ఇరగదీస్తే.. సందీప్ మాస్టర్‌లా శివాజీ విశ్వరూపం చూపించాడు. ఎగిరెగిరి తొడలు కొట్టుకుంటూ.. సందీప్ మాస్టర్ మాదిరిగా ఒట్టేసే భంగిమను చూపించి వారెవ్వా అనిపించాడు శివాజీ. వీళ్లిద్దరూ సీరియస్‌గానే గొడవపడుతున్నట్టుగా నటించడం కాదు కానీ జీవించేశారు.
Also Read:కొడం’గల్’.. రేవంత్ ‘నిల్’!