Bigg Boss 7 Telugu:నాలుగో పవరాస్త్ర విజేత ప్రశాంత్

55
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా నాలుగోవారం పూర్తిచేసుకోవడానికి వచ్చింది. ఇక రెండు ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుండగా ఈ వారం 6 గురు నామినేట్ అయ్యారు. ఇందులో ఒకరు హౌస్ నుండి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాజా ఎపిసోడ్‌లో పవరాస్త్ర కోసం ముగ్గురు యావర్,ప్రశాంత్,శుభ శ్రీ పోటీపడగా ప్రశాంత్ విజేతగా నిలిచాడు. పట్టువదలకు డింభకా అనే టాస్క్‌లో భాగంగా పవరాస్త్రని ముగ్గురు పోటీదారులు పట్టుకునే ఉండాలి. చివరి వరకూ ఎవరైతే పవరాస్త్రని పట్టుకుని ఉంటారో వాళ్లే నాలుగో వారంలో పవరాస్త్ర సాధిస్తారని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌కి శివాజీని సంచాలకుడిగా నియమించారు.పోటీదారులను తాకకుంటా కంటెస్టెంట్స్ డిస్ట్రబ్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పారు.

ప్రశాంత్‌ని చెడగొట్టడానికి రంగంలోకి అమర్ దీప్ దిగగా..రతిక సైతం మరోసారి తన వంకర బుద్దిని చాటుకుంది. ప్రశాంత్ నిన్ను అక్కా అన్నాడు కదా.. ఎందుకు అన్నాడంటావ్ అని అడిగితే.. అతను అంతే.. అపరిచితుడు ఎప్పుడు ఏ రిలేషన్‌లో ఉంటాడు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది రతిక. ప్రశాంత్ దగ్గరికి వచ్చి బొచ్చు తప్ప ఏం లేదు.. నీకు సిగ్గులేదా? మీ ఇంట్లో ఇలాగే పెంచారా? ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించకు.. నీకు చివరికి బొచ్చు మాత్రమే మిగిలుతుంది అంటూ నోటికొచ్చినట్టు పేలింది. అమర్ దీప్ కూడా రెచ్చగొట్టే మాటలతో బాధపెట్టారు. వాళ్లు ఎన్ని మాటలు అన్నా ప్రశాంత్ మాత్రం పవరాస్త్రను వదలలేదు.

Also Read:జంధ్యాల గారి జాతర 2.0

తర్వాత పోటీదారులు ఒకరినొకరు కన్వెన్స్ చేసుకోవచ్చని తర్వాత తెలిపారు బిగ్ బాస్. అయితే ఎవరు కన్విన్స్ కాలేదు. దీంతో ఈ టాస్క్‌ని రద్దు చేసి.. మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కదలకురా.. వదలకురా అనే టాస్క్ ఇవ్వగా దీనికి శివాజీనే సంచాలకుడిగా వ్యవహరించారు. అయితే ఈ బ్యాలెన్సింగ్‌ టాస్క్‌లో మొదట.. యావర్ పవరాస్త్ర కింద పడిపోవడంతో పోటీ నుండి తప్పుకున్నాడు. తర్వాత శుభ శ్రీ పవరాస్త్ర కూడా పడిపోవడంతో ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో రెండు వారాల ఇమ్యూనిటీని పొందగా అమర్ దీప్, రతిక మొహాలు మాడిపోయాయి. తాను గెలవడంతో శివాజీ కాళ్లు మొక్కాడు ప్రశాంత్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు.. ఎన్ని మాటలు వచ్చినా.. ఎన్ని మాటలు అన్నా.. నవ్వుతూ ఉండు అంటూ హితబోద చేశాడు శివాజీ.

- Advertisement -