Bigg Boss 7 Telugu:శోభా వర్సెస్ శివాజీ

47
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 96 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శోభా వర్సెస్ శివాజీ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. తొలుత నిన్నటి బాల్ టాస్క్ కంటిన్యూ అయింది. నా దృష్టిలో అమర్ ఔట్ అంటూ యావర్ అంటే.. కాదు ప్రశాంత్ కూడా ఔట్ అని మరో సంచాలక్ శోభా చెప్పింది. దీంతో ఇద్దరూ డిసైడ్ అయి చివరికి ప్రశాంత్‌ని కూడా ఔట్‌ అంటూ ప్రకటించారు. దీంతో శివాజీ ప్రశ్నించగా దీనికి శోభా చాలా రూడ్‌గా మీరలా ఆడితే తీసెస్తాను అంటూ శివాజీ ముఖం మీద చెప్పింది. దీంతో శివాజీ కూడా రెయిజ్ అయ్యాడు. రౌండ్‌కో రూల్ మారుస్తావా ఏంటి.. మీరే ఆడుకోండి నేను ఔట్.. అంటూ శివాజీ కోటు విప్పి పక్కన పారేశాడు.

శోభా రెచ్చగొట్టడంతో శివాజీ ఇక శివాలెత్తాడు. నేను ఎప్పుడూ క్రాస్ అయి మాట్లాడలేదు శోభా.. వాదించడం ఆపు.. అంటూ సీరియస్ అయ్యాడు. దీనికి శోభా మీరు కూడా ఆపండి.. అంటూ మాటకి మాట చెప్పింది. గొడవ పెద్దది కాగా ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోకు మంచిది కాదు.. అయినా నువ్వు చాలా గొప్పదానివి.. సారీ అమ్మా అంటూ పక్కన కూర్చున్నాడు.

తర్వాత యావర్ బతిమాలడంతో మళ్లీ గేమ్ ఆడటానికి వచ్చాడు శివాజీ. చివరికి ఈ గేమ్‌లో అర్జున్ విన్ అయ్యాడు. తర్వాత యావర్-ప్రశాంత్‌లతో కూర్చొని శివాజీ మాట్లాడాడు. వాళ్లు గెలవనియ్యరురా మిమ్మల్ని.. ఆడనివ్వరు.. వాడు ఆడపిల్లల అడ్వాంటేజ్ తీసుకొని ఎగబడుతున్నారు. క్యారెక్టర్ లేని మనుషులు వీళ్లతో ఆడటం కంటే వదిలేయడమే బెటర్ అని చెప్పాడు శివాజీ.

Also Read:వాటిలో మాత్రమే ఉచితం..అన్నిట్లో కాదండోయ్!

తర్వాత అమర్‌ని కూర్చోబెట్టి ప్రియాంక-శోభాలు అదే డిస్కషన్ మళ్లీ తీశారు. నీ వల్ల రెండు రోజులుగా కుంగిపోతున్నాను అని ప్రశాంత్‌తో అన్నావ్‌గా దేనికి.. అంటూ శోభా అడిగింది. నామినేషన్లో వాడు మాట్లాడిన మాటలకి.. అయినా ఎదుటోడ్ని కన్ఫ్యూజ్ చేసి టెంపర్‌మెంట్ ఎలా లేపాలో వాడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు అన్నారు. శోభా కూడా అమర్‌తో సొల్లు పురాణం మొదలుపెట్టింది.

తర్వాత మరో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. అందరూ తలపై క్యాప్స్ ధరించి.. క్యాప్‌పై ఉన్న సూదితో బెలూన్‌లు పగలగొట్టి అందులో నుంచి పడిన క్యాండీస్ (చాక్లెట్లు) సేకరించాలి అని చెప్పాడు. ఎవరు ఎక్కువ తీసుకుంటే వారే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశానికి దగ్గరవుతారని చెప్పాడు. ఇక ఆల్‌రెడీ ఒక గేమ్ విన్ కావడంతో అర్జున్‌ని సంచాలక్‌గా పెట్టారు. ఇక ఈ గేమ్‌లో అందరికంటే ఎక్కువ సంపాదించిన శివాజీ విన్ అయ్యాడు.

దీంతో ప్రేక్షకులను తనకు ఓటు వేయాలని విన్నవించాడు శివాజీ. 14వ వారం ముగుస్తుంది.. ఇక్కడ మీరు వేసే ప్రతి ఓటు.. ఇక్కడ ఎవరు విజేతలు అనేది నిర్ణయిస్తుంది.. నాది రియల్ లైఫ్ అయినా, ఇక్కడ షో అయినా ఒకటే సూత్రం.. బతుకు బతికించు…ఒక 50 ఏళ్ల ముసలోడిని అయినా.. 25 ఏళ్ల పిల్లలతో పోటీ పడ్డాను.. ఆ అవకాశం బిగ్‌బాస్ ఇచ్చాడు.. ఆ ఛాలెంజ్ నా కొడుకు విసిరాడు మిగిలింది మీ చేతిలోనే ఉంది అంటూ అప్పీల్ చేశాడు.

Also Read:వికలాంగులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి..

- Advertisement -