Bigg Boss 7 Telugu:నామినేషన్స్‌ వాడివేడిగా..

40
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 92 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని..నామినేట్ చేసే వారి ఫోటోను టైల్‌పై ముద్రించి గోడ మీద పెట్టి సుత్తితో పగలగొట్టాలని తెలిపారు బిగ్ బాస్. తొలుత యావర్‌తో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా శోభా శెట్టి, ప్రియాంకను నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తూ నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు అంటూ శోభాతో తెలిపారు యావర్. మధ్యలో బ్రేక్ రావడంతో అమర్‌తో మాట్లాడుతూ శోభా రెచ్చిపోయింది. ఫేవరిజం అని తీస్తారేంట్రా ప్రతిసారి.. ఏం నోరుతో చెబుతాడ్రా వాడు.. నా కంటే వాడు ఎక్కువ పని చేస్తాడని.. నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పుకొచ్చింది.

తర్వాత ఛాన్స్ దొరకగానే ముందు యావర్‌ని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ నేను నిన్ను నామినేట్ చేసినందుకు నీ నీద నాకు నెగిటివిటీ ఉందని నాగ్ సార్ ముందు చెప్పావ్ కదా అంటూ శోభా మొదలుపెట్టింది.తన రెండో నామినేషన్ శివాజీకి వేసింది శోభా. అన్నా లాస్ట్ వీక్ ఫస్ట్ రౌండ్ చాలా బాగా ఆడారు.. కానీ రెండో రౌండ్ మీరు సరిగా ఆడలేదు అని సొల్లు రీజన్ చెప్పింది. తర్వాత ప్రశాంత్ తొలుత అమర్‌ని నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ నువ్వు గేమ్‌లో ఫౌల్ చేశావ్ కదా అన్నా.. అదే నా పాయింట్ అంటూ చెప్పాడు. ఫౌల్ గేమ్ ఆడినందుకు గాను అమర్‌ని మొదటిగా నామినేట్ చేశాడు అర్జున్. తర్వాత యావర్‌ని నామినేట్ చేస్తూ లాస్ట్ వీక్ నువ్వు సాండ్ గేమ్‌లో తాళం చెవి పడేయడం వల్ల నేను నష్టపోయాను అని చెప్పాడు.

Also Read:సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా

అమర్‌ని నామినేట్ చేసింది ప్రియాంక. నీ ఫౌల్ గేమ్ వల్ల నేను నష్టపోయాను అని చెప్పగా రెండో నామినేషన్ యావర్‌కి వేసింది ప్రియాంక. శివాజీ మొదటిగా ప్రియాంకని నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడావని నాకు అనిపించిందని చెప్పాడు. తర్వాత ఫౌల్ గేమ్ ఆడినందుకు అమర్‌ని నామినేట్ చేశాడు శివాజీ. చివరిగా ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు అమర్. నువ్వు నామినేషన్స్ వేసే సిల్లీ రీజన్స్ నాకు నచ్చలేదు అని చెప్పాడు. నమ్మినోళ్లని మోసం చేయడం నీ గుణం.. మోసపోయింది నువ్వు కాదు నేను అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. యావర్‌ నామినేషన్‌కి రీజన్ చెబుతూ ప్రతిసారి నువ్వు అందరినీ నాతో కంపేర్ చేయకు.. వాడేమో (ప్రశాంత్) నాకు మైండ్ ఉంది అంటాడు.. నువ్వేమో లేదంటావ్.. అంటూ అమర్ అన్నాడు. ఇంతలో ప్రశాంత్ లేచి అక్కర్లేదు నువ్వు నా పేరు తీయకు.. అన్నాడు. దీంతో అమర్.. కూర్చో నువ్వు.. నీ పేరే తీస్తా.. కెప్టెన్ నేను.. నేను చెప్పింది నువ్వు చేయాలి అంటూ వేలు చూపించాడు అమర్. అంతే గొడవ పెద్దదైంది. మొత్తంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా ముగిసింది.

- Advertisement -