Bigg Boss 7 Telugu:శివాజీ వర్సెస్ అమర్..క్లారిటీ ఇచ్చాడు

39
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 12 వారం పూర్తి కావడానికి వచ్చింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఇంటి నుండి బయటకు వస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఈ వారం హౌస్‌లో జరిగిన దానిని రీవిల్ చేస్తూ అంతా అనుకున్నట్లే శివాజీ – అమర్‌లకు ఇచ్చిపడేశాడు. శివాజీని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు నాగ్. ఎలా ఉన్నావ్ అంటూ నాగ్ అడిగితే న్యాయంగా అయితే బాలేను బాబు గారు అని చెప్పాడు. మొన్న బ్రిక్ మీద పడ్డాను.. చేయి బాగా లాగేస్తుంది.. పైకి కనబడనివ్వట్లేదు అని చెప్పాడు.

తర్వాత ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్‌ను బ్రహ్మాండంగా ఆడావయ్యా అంటూ ప్రశంసలు గుప్పించారు నాగ్. తర్వాత ఏంటి శివాజీ చెప్పగానే స్టోర్ రూమ్‌లోకి అలా వెళ్లిపోయావ్.. ఏంటి అంత నమ్మకం అంటూ నాగ్ కాసేపు ఆటపట్టించారు. తర్వాత అమర్-శివాజీ టాపిక్ వచ్చింది. ముందుగా అమర్‌ని లేపి అసలు ఇరగదీసేశావ్ అమర్.. చాలా ఫన్ క్రియేట్ చేశావ్ పోలీస్ గెటప్‌లో అని చెప్పాడు. కెప్టెన్సీ గురించి డిజప్పాయింట్‌మెంట్ ఉండొచ్చు కానీ కప్పు అనేది దాని కన్నా చాలా పెద్దది.. దాని కోసం ఆడు అని చెప్పాడు. తర్వాత అమర్‌కి సంబంధించిన వీడియో చూపించారు నాగార్జున. గతంలో ప్రశాంత్‌ని సెంటిమెంట్ డ్రామాలు ఆడద్దంటూ అమర్ చెప్పిన వీడియో చూపిస్తూ సింపథీ గేమ్ ఆడొద్దు అనేది నువ్వే కదా.. మరి నిన్న అంత డ్రామా ఎందుకు చేశావ్ అంటూ ప్రశ్నించారు. నా వరకూ వచ్చాకనే ఆ బాధ నాకు తెలిసింది సార్.. అది యాక్టింగ్ కాదు సార్ అని చెప్పాడు అమర్. నా అనుకున్న మనుషులు నాకు దెబ్బేశారు సార్.. శివాజీ అన్నని నమ్మేశా కానీ అలా చేశారంటూ అమర్ చెప్పాడు.

ఇక శివాజీని పైకి లేపి నాగ్ ప్రశ్నలు వేశారు. అమర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట కోసం చచ్చిపోతాను అన్నావ్ కదా.. మరి ఎందుకు మాట మార్చావ్ అంటూ నాగ్ అడిగారు. అవును సార్ మాటిచ్చాను కానీ డిప్యూటీలుగా ఎవరిని పెట్టుకుంటావ్ అంటే వాళ్లనే పెట్టుకుంటా అన్నాడు సేఫ్ గేమ్ నడుస్తా ఉంది.. అందుకే నేను అంతకుముందు అర్జున్‌కి ఇచ్చిన మాట ప్రకారమే వెళ్లిపోయాను అని చెప్పాడు. అమర్‌‌ని పైకి లేపి ఎందుకు నువ్వు కెప్టెన్ అయినప్పుడు వాళ్ల ఇద్దరినే డిప్యూటీలుగా తీసుకుందామనుకున్నావని నాగార్జున అడిగారు. అంటే మేము ముగ్గురం ముందే మాట్లాడుకున్నాం సార్.. అయినా దీనికి మాకు శివాజీ అన్నా ఎగ్జాంపుల్.. ఆయన కెప్టెన్‌గా ఉన్నప్పుడు యావర్-ప్రశాంత్‌లే కదా డిప్యూటీలు.. అలానే యావర్ కూడా వాళ్లిద్దరినే తీసుకున్నాడు అని చెప్పాడు.

శివాజీ నువ్వు అర్జున్‌కి కూడా మాట ఇచ్చానని అమర్‌కి ముందే చెప్పేసి ఉంటే సరిపోయేది. కానీ నువ్వు చివరి నిమిషం వరకు చెప్పలేదు అందుకే ఇక్కడి వరకూ వచ్చిందని నాగ్ అన్నారు. ఇక చివరిగా నాగ్ మాట్లాడుతూ అమర్ నీ ఎమోషన్, నీ నిజాయితీ నాకు అర్థమవుతుంది కానీ నువ్వు పాతలో ఒకలా.. ఇప్పడు మరోలా మాట్లాడి, అక్కడేమో అది నా స్ట్రాటజీ అని చెప్పి.. ఇక్కడ ఇదే ఒరిజినాలిటీ అంటే ఆడియన్స్ అయోమయానికి గురవుతారని నాగ్ అన్నారు.

Also Read:మొబైల్ యాప్‌తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు..

- Advertisement -