Bigg Boss 7 Telugu:శివాజీ నట విశ్వరూపం

46
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతగా 81 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో శివాజీ మరోసారి తన గుట్టును బయటపెట్టాడు. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉన్న అమర్ దీప్, అర్జున్‌లు.. శివాజీపై అనుమానం వ్యక్తం చేశారు. స్టోర్ రూంకి వెళ్లడం ద్వారా ప్రశాంత్ డెడ్ అయ్యాడు.. అక్కడికి వాడ్ని ఎవరు పంపారో తెలుసుకుంటే అతనే మర్డర్లు చేస్తున్నట్టు లెక్క అని అర్జున్ అంటే శివాజీనే చెప్పేశాడు అమర్ దీప్. శివాజీ అన్న గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే.. తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. వీళ్లందర్నీ ఓ వైపు తిప్పి ఆడారు చూశారు అనే మాట వస్తుంది.. ఆ మాట కోసమే అందర్నీ తప్పు దారి పట్టిస్తున్నాడు తెలిపాడు.

అనంతరం శివాజీని పిలిచిన బిగ్ బాస్.. అశ్వినిని మర్డర్ చేయాల్సి ఉందని చెప్పగా అనుకున్నట్టుగానే పేస్ట్‌తో కిచెన్ మిర్రర్‌పై రాసి టాస్క్ పూర్తి చేశాడు. దీంతో అశ్విని డెడ్ అయ్యింది. అయితే ఇన్విస్టిగేషన్ ఆఫీసర్లు మాత్రం అశ్వినిని విచారించే పనిలో పడ్డారు. ఇంతలో మిర్రర్‌పై అశ్విని పేరు రాసి ఉండటం శోభా చూసి అందర్నీ పిలుస్తుంది. అయితే శివాజీ పక్కనే ఉన్న రతిక…. శివాజీపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని చేతుల్ని చూస్తుంది. చిరాకుతో శివాజీ ఏయ్ పిచ్చా నీకేమైనా ఏం చేస్తున్నావ్ అని అరుస్తాడు.

ఇంతలో పోలీసులు అమర్, అర్జున్‌లు వచ్చి.. ఒకరి తరువాత ఒకర్ని పిలుస్తారు. అద్దంపై ఏ పేస్ట్‌తో అయితే శివాజీ రాశాడో దానిని వెతికి తీసుకొచ్చి అర్జున్‌కి ఇస్తాడు అమర్. అయితే ఆ పేస్ట్‌‌కి ఓ వెంట్రుక అంటుకుని ఉండటాన్ని గమనిస్తారు పోలీసులు. ఆ వెంట్రుక ముసలి వెంట్రుక కావడంతో శివాజీపై అనుమానం వ్యక్తం చేస్తారు. రతిక.. శివాజీపై అనుమానంతో పోలీసుల దగ్గరకు వెళ్లి.. అతన్ని విచారిస్తే మీకు నిజాలు తెలుస్తాయని చెప్తుంది. అయితే రతిక కావాలనే.. ఇలా చేస్తుందని ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తారు పోలీసులు.

ఇక శోభా, గౌతమ్, ప్రియాంకలు అయితే.. శివాజీనే మర్డర్లు చేస్తున్నది. మనం గుంపులుగా ఉండటం కాదు.. ఆయన మనతో ఉండేట్టు చూడాలని చెబుతారు. ఆయనపై ఓ కన్నేసి ఉంచాలి అని ప్రియాంక, శోభాలతో చెప్తాడు గౌతమ్. ఇంతలోనే శివాజీ.. వాష్ రూంలోకి వెళ్తాడు. అది గమనించిన ప్రియాంక.. శివాజీ వెనుకే వెళ్తుంది. అమర్ దీప్‌ని 420.. 420 అంటూ దారుణంగా హేళన చేస్తాడు శివాజీ. జామగాయలు అమ్ముకునేవాడని.. వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చిందని ఎగతాళి చేస్తాడు. అమర్ దీప్ మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.. ఎన్నిసార్లు తనని 420 అన్నా కూడా జోక్‌గానే తీసుకున్నాడు. తర్వాత శివాజీకి గౌతమ్‌ని డెడ్ చేయాలని టాస్క్ ఇస్తారు బిగ్ బాస్. శివాజీ.. ఆ డెత్ స్టిక్కర్‌ని అమర్‌కి చూపిస్తాడు. అయితే శివాజీకి ఇచ్చిన టైంలో గౌతమ్‌ని మర్డర్ చేయడంలో విఫలం కావడంతో శివాజీ ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్ అయినట్టు చెప్తాడు బిగ్ బాస్.

అనంతరం ఆ టాస్క్‌ని ప్రియాంకకి అప్పగించి.. గౌతమ్‌ని మర్డర్ చేయాలని శివాజీతో చెప్పిస్తారు బిగ్ బాస్. అయితే శివాజీ ఫోన్ ఇస్తుంటే.. మీ మాట నేను ఎలా నమ్మాలి.. మీరు నన్ను మర్డర్ చేయరని గ్యారంటీ ఏంటి అని అనుమానం వ్యక్తం చేసింది ప్రియాంక. అయితే శివాజీ ఫోన్ ఇవ్వడంతో.. అతన్ని నమ్ముతుంది ప్రియాంక. అనంతరం శివాజీ చెప్పినట్టే డెత్ స్టిక్కర్‌ని గౌతమ్‌కి అంటించి.. అతన్ని డెత్ చేస్తుంది ప్రియాంక. వాజీని జైలుకి తరలిస్తుంటే.. తెలివిగా తప్పించుకుని వెళ్లి బాత్ రూంలో దాక్కుంటాడు.

Also Read:లక్ష్మీ పార్వతి ఓకే.. మరి బాలకృష్ణ ఏమిటి?

- Advertisement -