Bigg Boss 7 Telugu:పోటుగాళ్లదే గెలుపు

49
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 37 రోజులు పూర్తి చేసుకుంది. ఇక హౌస్‌లో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు మధ్య జరిగిన టాస్క్‌ల్లో పోటుగాళ్లు విజయం సాధించారు.
మొదటి టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో టైర్లతో నిండిన రెండు పోల్స్ పెట్టారు. ఇక స్విమ్మింగ్ పూల్‌లో ఖాళీగా రెండు పోల్స్ ఉన్నాయి. ఆటగాళ్లు, పోటుగాళ్లు రెండు టీమ్స్ నుంచి చెరో జంట ఈ టాస్క్ ఆడాలని చెప్పారు.

జంటలో నుంచి ఒకరు పూల్‌లో ఉంటారు. మరొకరు టైర్ల వద్ద ఉంటారు. పూల్‌లో నంబర్ టోకెన్స్ ఉన్నాయి.. అలానే బయట పోల్‌ దగ్గర టైర్లకి కూడా నంబర్లు ఉన్నాయి.. పూల్‌లో ఉన్న వారు నంబర్ తీసి బయట ఉన్న తన పార్టనర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది.. బయట ఉన్న వారు టోకెన్లో ఉన్న నంబర్ టైర్‌ను పూల్‌లో ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. ఇలా మొత్తం పూల్‌లో ఉన్న నంబర్ల ప్రకారం ఆ టైర్లు మొత్తాన్ని స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఖాళీ పోల్స్‌లో పెట్టాలన్న మాట. ఇలా ఎవరూ ముందు చేస్తారో ఆ టీమ్ విజేతగా నిలుస్తుందని చెప్పారు.ఈ టాస్క్‌లో పోటుగాళ్ల టీమ్ గెలిచింది.

తర్వాత ‘ఎవరు జీనియస్’ అంటూ రెండు టీమ్స్ మెంటల్ స్కిల్స్ తెలుసుకునేందుకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చారు. చెరో టీమ్ నుంచి ఒకరు బజర్ దగ్గర నిల్చుంటారు. ఎదురుగా ఉన్న స్క్రీన్‌లో కనిపించిన బొమ్మకి సంబంధించి ఓ ప్రశ్న అడుగుతారు. ఎవరు ఎక్కువ రైట్ ఆన్సర్స్ చెబితే వాళ్లు విన్నర్స్. అమర్ దీప్ ఆటగాళ్ల టీమ్ తరఫున …పోటుగాళ్ల తరఫున గౌతమ్ వచ్చారు. .అయితే అమర్‌కు టాస్క్ సరిగా అర్థం కాలేదు. దీంతో తేజ రాగా గౌతమ్‌కి గట్టిపోటీ ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పోటుగాళ్లు టీమ్ విజయం సాధించింది. ఫిట్టెస్ట్ ట్యాగ్‌తో పాటు ఇటు జీనియస్ అనే ట్యాగ్ కూడా పోటుగాళ్ల టీమ్‌కి ఇచ్చారు బిగ్ బాస్.

Also Read:CM KCR:16 రోజుల షెడ్యూల్ రిలీజ్

- Advertisement -