Bigg Boss 7:పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల

34
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శివాజీ, ప్రియాంకల జర్నీ చూపించి బిగ్ బాస్ ఏడిపించేశాడు. వచ్చాడయ్యో సామీ సాంగ్ వేసి శివాజీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఇక గార్డెన్ ఏరియాలో ఉన్న తన ఫొటోలు చూసి శివాజీ ఆశ్చర్యపోయాడు. కాఫీని ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లిన తర్వాత శివాజీ గురించి చాలా గొప్పగా చెప్పాడు బిగ్‌బాస్. ఒక సామాన్యూడిగా మొదలైన మీ ప్రయాణం.. ఒక నటుడిగా, ఒక వాయిస్ ఆర్టిస్టుగా, ఒక యాక్టివిస్టుగా వివిధ సమయాల్లో వివిధ పాత్రల్లో అలవోకగా ఇమిడిపోతు ఎంచుకున్న ప్రతి పాత్రకి న్యాయం చేశారు. ఇదే మీకు ప్రేమను తెచ్చిపెట్టింది.

మిమ్మల్ని ఒక వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు వాళ్ల వైపు చూపించేలా చేయగల మాటకారి మీరు.. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణక్యుడిగా నిలిచారు. ఈ ప్రయాణంలో మిగతావారితో సమానంగా టాస్కుల్లో పోటీ పడి.. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా ఓటమి వైపు చూడలేదు అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ లో తన జర్నీని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు శివాజీ.

తర్వాత ప్రియాంక వంతు వచ్చేసింది. గార్డెన్ ఏరియాలో సెటప్ చూసి ప్రియాంక అయితే తెగ సంబరపడిపోయింది. తన లవర్ శివ్‌తో ఉన్న ఫొటో చూసి ఏడ్చేసింది ప్రియాంక. చాలా బావుంది బిగ్‌బాస్ ఐ లవ్ దిస్..పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల అని చెప్పారు బిగ్ బాస్. లోపలికి రాగానే ప్రియాంకని ఆకాశానికెత్తేశాడు బిగ్ బాస్. స్నేహానికి విధేయత.. నిర్భయంగా నోటి మాట.. దృఢ సంకల్పంతో ఆడే ఆట.. మీ ప్రయాణాన్ని నిర్వచించాలంటే ఈ మూడు మాటలు సరిగ్గా సరిపోతాయ్ అని చెప్పాడు.

ఒకరి కోసం ఒకరు నిలబడకపోతే స్నేహానికి విలువ లేదని చూపించారు.. ఇంట్లోకి వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు పొట్టి పిల్ల అనుకున్నారు.. కానీ కాదు.. మీరు చాలా గట్టి పిల్ల.. గోడకి కొట్టిన బంతిలా ప్రతిసారి మీ 100 శాతం ఇస్తూ వచ్చారు అని చెప్పగా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ప్రియాంక.

Also Read:హను-మాన్…థియేట్రికల్ ట్రైలర్

- Advertisement -