బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 6వ వారంలోకి ఎంటరైంది. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ వాడివాడిగా సాగింది. అసలైన రచ్చ మొదలు కాగా పాత కంటెస్టెంట్స్ వర్సెస్ కొత్త కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆటగాళ్లు (పాత కంటెస్టెంట్లు) X పోటుగాళ్లు (కొత్త కంటెస్టెంట్లు) మధ్య పోరు జరుగగా ఆటగాళ్ల ఐదువారాల ఆట చూసిన పోటుగాళ్లకి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. వారిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అనర్హులో కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేయమన్నాడు. దీనికి కొత్తోళ్లు ఒక్కొక్కరు వాళ్ల అభిప్రాయాల మేరకు నామినేట్ చేశారు. ఇక అశ్విని.. ముందుగా అమర్‌ని నామినేట్ చేసింది. తర్వాత శోభా శెట్టిని తన రెండో నామినేషన్‌కి సెలక్ట్ చేసింది అశ్విని.
ముందుగా తన నామినేషన్ ఎవరో చెప్పే ముందే ఓ క్లారిటీ ఇచ్చాడు అంబటి. అపార్థం చేసుకోవడం మొదలుపెడితే అర్థం చేసుకోవడం మానేస్తారు.. కనుక దయచేసి అర్థం చేసుకోండి అంటూ మొదలుపెట్టాడు. ముందుగా సందీప్‌ని నామినేట్ చేశాడు.తన రెండో నామినేషన్‌గా అమర్‌ని సెలక్ట్ చేశాడు అర్జున్. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గొడవ జరిగింది.
Also Read:ఓ.. ప్రగ్యా జైస్వాల్ కి ఛాన్సొచ్చింది
ఇక ఆ తర్వాత కాసేపటికే ఆటగాళ్లకి కూడా పోటుగాళ్ల నుంచి ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో శోభా.. అశ్వినిని చేసేసింది. నువ్వు చెప్పిన రీజన్ నాకు సరిగా అనిపించలేదు అంటూ చెప్పింది. దీంతో అశ్విని ఏడుపు మొదలుపెట్టింది. శోభా అరుపులు వినలేక.. ప్లీజ్ నామినేట్ చేసెయ్, ప్లీజ్ ఎలిమినేట్ చేసేయండి.. నేను ఇంటికెళ్లిపోవాలి.. ఒక గేమ్ అయినా ఆడకుండానే ఇలా చేస్తున్నారంటూ మస్త్ ఏడ్చింది అశ్విని. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కూడా తమ రీజన్స్ చెబుతూ ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు. కానీ అందరిలో ఎక్కువగా అమర్‌కు ఎక్కువగా 7 నామినేషన్స్ పడ్డాయి.