Bigg Boss 7: ఈ వారం నో ఎలిమినేషన్‌

92
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 77 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 11 వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించారు నాగార్జున. ఇదే సమయంలో వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తేల్చిచెప్పారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఇప్పటివరకు 10 వారాల్లో 10 మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

వాస్తవానికి ఈ వారం ఎలిమినేషన్ ఉన్నట్లుగానే టెన్షన్ పెట్టించారు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు.తొలుత యావర్, ప్రియాంక తర్వాత శోభా, రతిక ఇక చివరిగా మిగిలిన గౌతమ్, అశ్వినీలను గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. ఇక వారి ముందు రెండు బాక్సులు ఉంచి అందులో చేయి పెట్టి పైకి తీయాలన్నారు. ఎవరి చేతికి రెడ్ కలర్ ఉంటుందో వాళ్లు ఎలిమినేట్, గ్రీన్ ఉన్న వాళ్లు సేఫ్ అన్నారు.

ఇక ఇద్దరి చేతికి గ్రీన్ ఉండటంతో ఇద్దరూ సేఫ్ అని ప్రకటించారు. యావర్ ఎవిక్షన్ పాస్ సరెండర్ చేయడం వల్ల ఈ వారం బిగ్‌బాస్ నో ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అలానే ఎవిక్షన్ పాస్‌ను మళ్లా గెలుచుకునే అవకాశం ఈ వారం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆనందంలో ఉన్న కంటెస్టెంట్స్‌కి షాకిస్తూ వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అంటూ షాకిచ్చేశారు.

Also Read:ఫైనల్లో నిరాశపర్చిన రోహిత్ సేన..

- Advertisement -