బిగ్ బాస్ 5…తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆమెనా..?

41
bb5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా నాలుగోవారంలోకి ఎంటర్‌కాగా ఇప్పటివరకు 25 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్‌ ఇంటి నుండి ఎలిమినేట్ కాగా నాలుగు వారాల్లో ఇంట్లో సభ్యుల మధ్య రచ్చ రచ్చతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.

ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వైల్డ్ కార్డు ఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ఓ లేడీ యాంకర్‌ను రంగంలోకి దించేందుకు కసరత్తు జరుగుతోందట. లేడీ యాంకర్‌ ఎవరో కాదు, విష్ణుప్రియ అని ప్రచారం జరుగుతోంది.

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో విష్ణు ఎంట్రీ ఇస్తుందనే వార్త అందరికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచిఉండాల్సిందే.