బిగ్ బాస్ 5…కెప్టెన్సీ నుండి జెస్సీ తొలగింపు

31
jessi

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్‌ 5 తెలుగు 25 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్సీ నుండి జెస్సిని తొలగించగా అబద్ధాల మాస్టర్ గా మారిపోయారు రవి,మునుగుతారా… తేలతారా, దమ్ ఘోష్ బిర్యానీతో విందు వంటి వాటితో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిపోయింది.

ముందు రోజు రాత్రి ఆహారం తీసుకోకపోవడంతో అందరూ చాలా నీరసంతో కనిపించారు. ఆహారం దొరకనప్పుడే ఆకలి విలువ తెలుస్తుందని, అనవసరంగా ఆహారాన్ని పడేసి కొందరు ఎంత తప్పు చేస్తుంటారో ఇప్పుడు అర్థమౌతోందని ఇంటి సభ్యులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. బిగ్ బాస్ చెప్పిన ఆదేశాలను పాటించనందుకు జెస్సీని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించారు. మంగళవారం ఇంటిలోని ఆహారం మొత్తాన్ని స్టోర్ రూమ్ లో పెట్టేయమని బిగ్ బాస్ చెప్పినా, కొందరు కంటెస్టెంట్స్ తమ దగ్గర దాచుకున్న ఆహారాన్ని తినే ప్రయత్నం చేశారు. వారిని ఇచ్చేయమని జెస్సీ రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇవ్వలేదు. దీంతో బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యారు జెస్సీ.

ఇక తర్వాత సెకండ్ టైమ్ థండర్ సౌండ్ రాగానే విశ్వ బటన్ పై చేయి మొదట పెట్టాడు. దాంతో విశ్వ – రవి జంటకు తమ అపోనెంట్ ను టాస్క్ లో ఎంపిక చేసుకునే ఛాన్స్ దక్కింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి, టాస్క్ ఏమిటో తెలుసుకుని, ఆ తర్వాత తమకు అపోనెంట్ టీమ్ గా ప్రియా – ప్రియాంకను విశ్వ అండ్ రవి ఎంపిక చేసుకున్నారు. టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉండే చెక్కలను రెండు ముక్కలుగా గొడ్డలితో కట్ చేయాలి. ఇది ఫిజికల్ స్ట్రెన్త్ ఉంటే కానీ గెలవలేని టాస్క్. ఈ టాస్క్ గురించి పూర్తిగా చదివిన తర్వాతే ప్రియాంక – ప్రియ జంటను ఎంపిక చేసుకున్న రవి… బయటకు వచ్చాక మాత్రం… టాస్క్ ఏమిటనేది తమకు తెలియదని, తెలికుండానే ప్రియా – ప్రియాంకను ఎంపిక చేసుకున్నామని చాలా తేలికగా అబద్ధం ఆడేశాడు.

తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మూడోసారి థండర్ సౌండ్ రాగానే సన్నీ బటన్ పై మొదట చేయి పెట్టాడు. దాంతో సన్నీ – మానస్ జంటకు అపోనెంట్స్ ను ఎంపిక చేసుకునే ఛాన్స్ దక్కింది. దాంతో వాళ్ళు నటరాజ్ మాస్టర్ కు ముందే మాట ఇవ్వడం వల్ల వారినే ఎంపిక చేసుకున్నారు. తర్వాత ‘మునుగుతారా… తేలతారా’. గార్డెన్ ఏరియాలో ఓ పెద్ద వాటర్ టబ్ ను ఏర్పాటు చేశారు. ఇంటిలో నిత్యం ఉపయోగించే వస్తువులు అందులో వేస్తే మనుగుతాయో, తెలతాయో బుర్రను ఉపయోగించి రెండు జట్లు చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ సరైన జవాబులు చెబితే వారు గెలిచినట్టు.ఇందులో లోబో అండ్ నటరాజ్ కు 8 మార్కులు రాగా, మానస్ – సన్నీ 9 మార్కులతో విజేతలుగా నిలిచారు.

టాస్క్ అయిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరి కోసం దమ్ ఘోష్ బిర్యానీ పంపాడు. అయితే… కంపల్సరీగా దానిని తినాలనే రూల్ ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు తినకుండా ఉండొచ్చునని చెప్పాడు లోబో గట్టిగా బిర్యానీని లాగించినా అతనితో జత కట్టిన నటరాజ్ మాస్టర్ బిర్యానీని ముట్టలేదు.