బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ షురూ అయింది. బుల్లితెర బిగ్గిస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు టీవీ ప్రేక్షకుల్ని పలకరించేసింది. హోస్ట్ గా కింగ్ నాగ్ టన్నుల కొద్ది కిక్.. ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామని అన్నారు. ఓ పండుగలా బిగ్ బాస్ షో మొదలైంది. ఇక నుండి నో బోరింగ్ అనే షో థీమ్ అద్దిరింది. ఇక నాగ్ తన కొడుకు అఖిల్ సాంగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు నాగ్. ఇక బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని ప్రేక్షకులకు చూపించడమే కాకుండా ఎక్కడ ఏవేమి ఉంటాయో కూడా చెప్పారు. ఇక నుండి కంటెస్టెంట్స్ తో మాస్ మసాలా ఉంటుందని అన్నారు. అలాగే మోజ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్ తో పాటుగా పవర్ రూమ్ అంటూ ఓ కొత్త ప్లేస్ ల ని పరిచయం చేశారు. పవర్ వస్తే కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయని అన్నారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఆటతో పాటు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆడాలని అన్నారు.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్.. బెడ్ రూమ్ లో రెండు బెడ్స్ ని లాక్ చేసి ఉండటంతో ఇదేంటి అని అడగ్గా.. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందని బిగ్ బాస్ సస్పెన్స్ లాక్ చేశారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ కంటెస్టెంట్ గా బుల్లితెర ఆర్టిస్ట్ సిరి ఎంటర్ అయ్యారు. వచ్చి రాగానే నాగ్ తో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులకు మసాలా ట్రీట్ ఇచ్చింది. నెక్ట్స్ సీరియల్ ఆర్టిస్ట్ సన్నీ, బోల్డ్ బ్యూటీ లహరి శారి, సింగర్ శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, లోబో, ప్రియా, జెస్సీ, బజర్థస్త్ ప్రియాంక, షణ్ముఖ్ జస్వంత్, హమీదా ఖాటూన్, నటరాజ్ మాస్టర్, సరయు, యాక్టర్ విశ్వా, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, యాక్టర్ మానస్, ఆర్ జే కాజల్, శ్వేతా, ఫైనల్ గా యాంకర్ రవిలు ఎవరి స్టైల్ లో వారు ఎంట్రీస్ ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయారు.
టోటల్ గా ఈ సారి 19 మంది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ దొరుకుందని నాగార్జున అన్నారు. ఇక వీరితో స్టార్టింగ్ రోజే ఓ గేమ్ ఆడించారు. సింగిల్ బెడ్ కోసం ఆడిన ఈ గేమ్ లో ప్రియాంక, విశ్వ, మానస్, సన్నీలు పోటీకి నిలవగా ఓ నాలుగు బాక్సుల్ని ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో విశ్వకి బెడ్ ఉండటంతో సింగిల్ బెడ్ ని సొంతం చేసుకున్నారు. ఈ సారి జోష్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ అన్నీ ఐదింతలు ఉంటాయని చెప్పి షోపై ఆసక్తి కలిగించారు.ఎప్పుడు లేని విధంగా తొలి రోజే గేమ్ ఆడించడంతో కంటెస్టెంట్స్ కాస్త టెన్షన్‌కి గురయ్యారు. దాదాపు వంద రోజులకు పైగా బిగ్ బాస్ సీజన్ 5 జరగబోతోంది. ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి.. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది.