బిగ్ బాస్ 5..సిరి జర్నీ అంతా షణ్ముఖే!

63
siri

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మరి కొద్దిరోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ జర్నీని చూపిస్తూ వారిని ఖుష్ చేసిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో భాగంగా సిరి జర్నీని చూపించారు. సిరి జర్నీ మొత్తం షణ్ముఖే ఉన్నాడు.

తొలుత సన్నీ జర్నీ వీడియో చూసి తన ఎమోషన్స్‌‌ని ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ఆ తరువాత తనకి ఇచ్చిన స్పెషల్ కేక్‌ని ఇంట్లో ఉన్న వాళ్లకి షేర్ చేశాడు. తర్వాత సన్నీ తనలోని జర్నలిస్ట్‌ని బయటకు తీసుకుని వస్తూ.. మానస్‌ని ఇంటర్వ్యూ చేశాడు. సీజన్ మొత్తంలో నీకు ఎవరి గేమ్ నచ్చదు అని అడిగాడు. దీంతో శ్రీరామ్ ఆట తనకి నచ్చదని చెప్తూ.. ఫస్ట్ నుంచి ఇప్పటివరకూ శ్రీరామ్‌తో కనెక్ట్ కాలేదన్నాడు.

ఇక సిరి తన జర్నీ వంతురాగా లోపలికి వెళ్లి వైజాగ్ వైజాగ్.. విశాఖపట్నం అంటూ తన ఫొటోలను చూసుకుని మురిసిపోయింది. మెమొరీలో తన మాజీ ప్రియుడు చిన్నాని (ప్రస్తుతం ఉన్న చోటూ కాదు) గుర్తు చేసుకుంది. సిరి అంటే ఏంటో ప్రపంచానికి చూపాలనే తపన.. ఈ ప్రయాణంలో కళ్లకి కట్టినట్టు అందరికీ కనిపించింది.. ఈ ఇంట్లో మీరు ఏర్పరచుకున్న బంధాలు.. దగ్గరైన మనుషులు.. మీలోని ఆ భావాలను తట్టిలేపారు పిట్ట కొంచెం కూత ఘనం మీ విషయంలో నిజం అని అందరికీ నిరూపించారని తెలిపారు బిగ్ బాస్.

తర్వాత సిరి జర్నీ వీడియో ప్లే చేయగా.. అందులో చాలా వరకూ సిరి-షణ్ముఖ్‌లు అలకలు.. హగ్‌లు.. ముద్దులే ఉన్నాయి. తనకు నచ్చిన ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలని కోరగా షణ్ముఖ్‌తో ఉన్న ఫొటోలనే ఏరి ఏరి తీసుకుంది. తర్వాత సన్నీ- మానస్‌ల గురించి మాట్లాడుకుంటూ వారికి అవకాశం ఇవ్వద్దంటూ సిరికి సూచించాడు షణ్ముఖ్‌.