బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుంది. 13వ వారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు ప్రియాంక. ఇక హౌస్ నుండి బయటికొచ్చిన ప్రియాంకకు ‘డాక్టర్ ప్రియాంక సింగ్’ అనే బిరుదును ఇచ్చారు నాగార్జున. సార్ దయచేసి అలా పిలవకండీ… ఇక బయట అందరూ నన్ను అలానే పిలిచి ఆడుకుంటారేమో అని వాపోయింది.
తొలుత సండే ఫన్ డేలో భాగంగా అస్లీ కారెక్టర్ అంటూ సినిమా పోస్టర్‌లతో ఇంటి సభ్యులను పోల్చమనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మొదటగా సన్నీకి మహానటి పోస్టర్ వస్తే.. ఆ పోస్టర్ ప్రియాంకకు సెట్ అవుతుందని బ్యాడ్జ్ పెట్టేశాడు. డాక్టర్ వసీకరణ్ పోస్టర్‌ను షన్నుకి ఇచ్చింది సిరి. నీలాంబరి పోస్టర్‌ను సిరికి షన్ను ఇచ్చాడు. కట్టప్ప పోస్టర్‌ను సిరికి శ్రీరామచంద్ర ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక బిరుదు ఇవ్వగా ఎలిమినేషన్‌లో ఉన్న నలుగురిలో మానస్‌ని సేవ్ చేశారు నాగ్.
తర్వాత నోట్లో నీళ్లు పోసుకుని పాటలు పాడాలి. దాన్ని మిగతా టీం సభ్యులు కనిపెట్టాల్సి ఉంటుందని చెప్పారు ఈ ఆటలో సన్నీ, కాజల్, ప్రియాంక ఓ టీం. సిరి, షన్ను, మానస్ మరో టీంగా ఉన్నారు. ఇక శ్రీరామచంద్రను సంచాలక్‌గా ఉండగా సిరి టీమ్ విజేతగా నిలిచింది. తర్వాత కాజల్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున.
ఆ తరువాత లూడో అంటూ మరో ఆట ఆడించాడు నాగ్. అయితే ఇందులో సిరి కోసం షన్ను, కాజల్ కోసం సన్నీ, ప్రియాంక కోసం మానస్ డైస్ థ్రో చేశారు. ఇక ఇందులో రెడ్ పనిష్మెంట్, గ్రీన్ వస్తే సేఫ్.. బ్లూ అయితే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నాడు. ఎక్కువగా షన్ను వేసిన డైస్‌కు సిరి బ్లూ బాక్సుల్లోకి సిరి వెళ్లింది. దీంతో షన్నుకు ప్రశ్నలు ఎదురయ్యాయి. టాప్ 5లో ఎవరు ఉండరని అనుకుంటున్నావ్ అనే ప్రశ్నకు కాజల్ అని షన్ను సమాధానం ఇచ్చాడు. ఇక చివరగా ఎలిమినేషన్‌లో ఉన్న సిరి,ప్రింయాకలో సిరి సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇక ఇంటి నుండి బయటికి వచ్చిన ప్రియాంక.. అందరి గురించి చెప్పుకొచ్చింది.తాను శ్రీరామచంద్రకు పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. షన్ను అన్నయ్య ఎప్పుడూ పక్కింటి పిల్లాడిలానే ఉంటాడు. ముందు తమ్ముడు అని పిలుద్దామని అనుకున్నా.. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్య అని పిలిచాను అని తెలిపింది. సన్నీ అన్నయ్యే నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. మొదట్లో అంతగా బాండ్ లేదు.. కానీ రాను రాను సన్నీ అన్నయ్య అంటే ఏదో ఒక ధైర్యం వచ్చింది.. విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను అని తెలిపింది.
మానస్‌ను మొదటిసారి చూసినప్పుడు.. ఎవరబ్బా ఈ సిల్కీ హెయిర్ అనుకున్నాను.. ఫస్ట్ టైం మాట్లాడాను. కానీ నన్ను చూసి మాట్లాడలేదు.. ఇంత పొగరేంట్రా? అనుకున్నాను.. ఇక ఎప్పుడూ మాట్లాడొద్దని అనుకున్నాను. కానీ మెల్లిమెల్లిగా క్లోజ్ అయ్యాం. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఇంకా నేర్చుకోవాలి.. విన్నింగ్‌తో బయటకు రావాలని చెప్పేసింది.