బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 67 హైలెట్స్

162
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 67 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 67వ ఎపిసోడ్‌లో భాగంగా అనీ మాస్టర్- సన్నీ మధ్య జరిగిన సన్నివేశాలు అందరి సహనానికి పరీక్ష పెట్టాయి.

తొలుత హౌస్‌లో ఓ కేక్ ముక్క పెట్టారు బిగ్ బాస్. ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉందంటూ రెండు రోజుల నుండి ఊరించారు. అయితే స్ట్రార్టింగ్‌లోనే సన్నీ.. ఏదైతే అది అయ్యింది నేను తినేస్తా అని రెచ్చిపోయారు. ఆనీ మాస్టర్ వద్దంటూ అడ్డుకుంది. కెప్టెన్ అయ్యాను కాబట్టి నాకే ఆ అర్హత ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది అనీ మాస్టర్.

దీంతో సన్నీ.. మీకు అర్హత ఉంటే తినండి మరి.. లేదంటే నేను తినేస్తా.. రిస్క్ తీసుకుంటా.. అని ముందుకు వచ్చాడు. అయితే సీక్రెట్ రూంలో ఉన్న జస్వంత్ అభిప్రాయాన్ని అడిగారు బిగ్ బాస్. ఆ కేక్ తినడానికి ఎవరు అర్హులని అనుకుంటున్నారు అని అడగ్గా.. రవికి అర్హత ఉంది అని చెప్పాడు జెస్సీ.

ఈ కేక్ తింటే ఇమ్యునిటీ వస్తుందేమో అనిపిస్తుంది అని రవి అంటే.. అది నువ్ అనుకుంటున్నావ్.. అసలు అర్హత ఏంటో బిగ్ బాస్ చెప్పలేదుగా అని కాజల్ చెప్పగా చివరికి ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది ఆ కేక్ తినే అర్హత హౌస్ కెప్టెన్ ఆనీకి ఉందని చెప్పడంతో నేను ఆ కేక్ తినొచ్చా అని బిగ్ బాస్‌ని అడుగుతుంది ఆనీ మాస్టర్. ఆమెకు ఆ కేక్ తినడానికి ధైర్యం చాలకపోవడంతో వెనకడుగు వేస్తుంది.

ఇక ఉదయాన్నే సన్నీ మానస్‌తో చర్చించి.. కెప్టెన్ ఆపొచ్చని అక్కడ రాయలేదు కదా.. అంటూ వెళ్లి ఆ కేక్‌ను తినేశాడు. సన్నీ తింటుంటే శ్రీరామ్, మానస్‌లు తెగ నవ్వుకున్నారు. తర్వాత ఆనీ మాస్టర్ బయటకు వచ్చి నోరెళ్లబెట్టింది. ఇది నాది.. నువ్ ఎందుకు తినేశావ్.. స్ట్రాటజీ ప్లే చేశావ్ అని సన్నీని నిలదీసింది ఆనీ మాస్టర్. తర్వాత లోపలికి వచ్చి ఏడ్వడం మొదలుపెట్టింది. నువ్ సెల్పిష్.. నా మాటకు విలువ ఇవ్వలేదు.. కెప్టెన్ అయిన నాకే ఆ కేక్ తినే అర్హత ఉంది అంటూ గోల గోల చేసింది.

తర్వాత బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ స్టాఫ్ కాగా.. ఆనీ మాస్టర్ హోటల్ మేనేజర్.. రవి హౌస్ కీపింగ్.. మానస్, ప్రియాంక హనీమూన్‌కి వచ్చిన జంట.. కాజల్ హోటల్ ఓనర్‌కి ఫ్రెండ్.. సన్నీ మొదటి సారి హోటల్‌కి వచ్చిన గెస్ట్.. సిరి ఓ డాన్ కూతురు.. ఇలా వారి వారి క్యారెక్టర్లను డిసైడ్ చేశారు బిగ్ బాస్. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి… హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఉంటాడని.. హోటల్ స్టాఫ్ ఇచ్చే అతిధ్యానికి ఆటంకం కలిగించి అతిథులకు మీ పని ఎక్కువ నచ్చేట్టు చేయాలని చెప్పారు. ఈ సీక్రెట్ టాస్క్ గురించి ఎవరికైనా చెప్పినా.. దొరికిపోయినా కెప్టెన్ పోటీదారులయ్యే ఛాన్స్ పోతుందని చెప్పారు బిగ్ బాస్.

- Advertisement -