బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 52 హైలైట్స్

133
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 52 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 52వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రియాంక తొలుత శ్రీరామ్‌ని పెద్దబావ అని,మానస్‌ని చిన్న బావ అని,జెస్సీని బుల్లిబావ అని పిలవగా లోబోని అన్నయ్య అన్నయ్య అంటూ ఆట పట్టించింది. తర్వాత నేను మాసన్ టాప్ 5లో ఉంటామ్.. మానస్ విన్నర్ అవుతాడు అని చెప్పగా మీరు టాప్‌లో ఉంటే మేమేం చేయాలి అడుక్కోవాలా? అంటూ సెటైర్ వేసింది సిరి.

తర్వాత రవి-షణ్ముఖ్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. నేను చూసినంతవరకూ.. షణ్ముఖ్ ఎక్కడ అంటే.. మోజ్ రూం విత్ త్రీ (సిరి, జెస్సీ, షణ్ముఖ్).. తప్పితే ఆన్ బెడ్ విత్ త్రీ తప్ప ఏముందన్నారు. తర్వాత కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా ‘అభయహస్తం’ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మొత్తం లాక్ డౌన్‌లోనే ఉంటుందని.. ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే ఉంటారని చెప్పారు. ఇంటిలోకి వెళ్లడానికి, కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి మొత్తం ఐదు ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లలో భాగంగా.. ఎవరు పోటీపడతారో ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలన్నారు బిగ్ బాస్. పోటీలో గెలిచిన వాళ్లు కెప్టెన్ పోటీదారులు కావడమే కాకుండా ఇంట్లోకి ప్రవేశం కూడా లభిస్తుందని చెప్పారు.

దీంతో మొదటి ఛాలెంజ్‌కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలకు అవకాశం ఇచ్చారు.పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను ఉంచారు.. ఆ ముత్యాలను ఒక్కొక్కటిగా వెతికిపట్టాలని ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికిపట్టుకుంటారో వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలు అవుతారని చెప్పారు బిగ్ బాస్. లోబో కంటే షణ్ముఖ్ ఎక్కువ ముత్యాలను వెతికిపట్టినప్పటికీ.. అవన్నీ నీట్‌గా లేవు.దీంతో సన్నీ ఆలోచనలో పడగా సిరి…షణ్ముఖ్ తరపున వాదించింది. ఇక ఈ టాస్క్‌లో షణ్ముఖ్‌ విజేతగా నిలిచాడు.

ఆ తరువాత రెండో టాస్క్‌కి యాంకర్ రవి, సిరిలు పోటీ పడ్డారు. ఈ టాస్క్‌లో భాగంగా పూల్‌లో ఉన్న బాటిల్స్‌ని గాలం ద్వారా తీసి ఒడ్డున పెట్టాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డున పెడతారో వాళ్లే విజేతలౌతారని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో రవిని కంగుతినిపించిన సిరి.. అతనికంటే ఎక్కువ బాటిల్స్‌ని సాధించింది. అయితే మొదట షణ్ముఖ్ గెలిచి.. తరువాత గెలిచిన సిరిలు కెప్టెన్ పోటీదారులు కావడంతో వాళ్లకి హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ దొరికింది.

మూడో పోటీదారులుగా శ్రీరామ్, మానస్‌లు పోటీపడ్డారు. రోప్‌ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువ సేపు రోప్ చేస్తూ ఉంటారో వారే విజేత అవుతారని టాస్క్ ఇవ్వడంతో ఈ టాస్క్‌‌లో మానస్‌పై శ్రీరామ్ గెలుపొందాడు.

- Advertisement -