బిగ్ బాస్..ప్రియాంక వర్సెస్ ఉమాదేవి!

113
priyanaka

బిగ్ బాస్ 5 తెలుగు ఇప్పటివరకు 5 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకుంది. పూర్తయింది 5 ఎపిసోడ్సే కానీ బిగ్ బాస్ హౌస్ రచ్చరచ్చగా మారిపోయింది. చిన్న చిన్న వాటికే ఇంటి సభ్యులు పెద్దగా గొడవ పడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా 5వ ఎపిసోడ్‌లో భాగంగా కార్తీకదీపం ఉమాదేవి, ప్రియాంక మధ్య గొడవ పెద్దదిగా మారి మాటల యుద్దానికి దారితీసింది.

వారం మొత్తంలో బెస్ట్, వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారిని సెలెక్ట్ చేయమని చెప్పగా ఈ ఎంపిక ప్రక్రియలో ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుని బాధపడిపోతుంది. అయితే తన దృష్టిలో బెస్ట్ పర్ఫామర్ అయితే లోబో అన్నయ్యా.. మనస్సూర్తిగా కడుపు పట్టుకుని నవ్వేంత నవ్వు అయితే నా జీవితంలో ఎక్కడా దొరకలేదని చెబుతుంది.

ఇక వరెస్ట్ పర్ఫార్మర్‌ ఉమాదేవి అని చెప్పగానే ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరుగుతుంది. ఆమె ప్రవర్తన, మాట తీరు, సరిగ్గా లేదని చెప్పింది. పెద్ద వారు అయి ఉండి.. అందరికీ చెప్పాల్సింది పోయి.. నేనింతే.. నేను చేయను.. ఇష్టమైతే చూడండి..లేకపోతే వదిలేయండి అని అనడం తప్పు అంటూ ప్రియాంక తన అభిప్రాయాన్ని చెప్పగా దానికి ఉమా అభ్యంతరం చెప్పడం చివరగా తల్లిదండ్రుల పేర్లు వచ్చే వరకు గొడవ వెళ్తుంది. దీంతో ప్రియాంక ..నోరుమూయ్ అంటూ ఉమాదేవిపై మండిపడుతుంది. అయితే తర్వాత సారీ చెప్పిన ఉమాదేవి శాంతించలేదు.