బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 26 హైలైట్స్

40
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 26 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.26వ ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఉదయం మంచి సాంగ్‌తో ఇంటి సభ్యులు లేవగా శ్వేతాకి పవర్ రూం యాక్సెస్ లభించడంతో.. ఛాలెంజ్ కోసం షణ్ముఖ్, సిరిలను ఎంచుకున్నారు. చిక్కులో చిక్కికోకు అనే టాస్క్‌లో భాగంగా చిక్కుల్లో ఉన్న ఆరు తాడుల్ని ఎవరైతే మొదట చిక్కులు తీస్తారో వారే విజేతలని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సిరి, షణ్ముఖ్‌లు పూర్తిగా విఫలం కావడంతో శ్వేత, ఆనీ మాస్టర్‌లు ఈ టాస్క్‌లో విజేతలుగా నిలిచారు.

గెలవాలంటే తగ్గాలి టాస్క్‌లో తొలి రోజు నుంచి ఎంతో డెడికేషన్‌తో ఆడిన మానస్, సన్నీలు విజేతలుగా నిలిచారు. అనంతరం ఇంటి సభ్యులు అందరికీ పిజ్జా, కూల్ డ్రింక్, స్వీట్స్‌ని పంపించారు బిగ్ బాస్. మొత్తంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కి సన్నీ-మానస్, ఆనీ- శ్వేతా, శ్రీరామ్-హమీదా జంటలు ఎంపిక కావడంతో.. ఈ జంటల్లో ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరు ఉండాల్సి వస్తుందని.. ఎవరు కెప్టెన్ పోటీదారులుగా ఉండాలో తేల్చుకోవాలని అన్నారు. దీంతో శ్రీరామ్ చంద్ర, శ్వేత, సన్నీ‌లు కెప్టెన్ పోటీదారులుగా నిలబడ్డారు.

ఇప్పటివరకూ ఫిజికల్‌గా మెంటల్‌‌గా జరిగిన టాస్క్‌ని బిగ్ బాస్ చెత్త చేసి పారేశారు. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న వారిలో అర్హత లేని వాళ్లు ఎవరో చెప్పి.. కత్తితో వాళ్లు ధరించిన బెల్ట్‌పై పొడవాలని కోరారు బిగ్ బాస్. ఎవరికి ఎక్కువ కత్తి పోట్లు ఉంటు వాళ్లు పోటీ నుంచి తప్పుకున్నట్టు.. తక్కువ కత్తి పోట్లు ఉన్నవాళ్లే హౌస్‌కి కెప్టెన్ అయినట్టు అని పిచ్చి టాస్క్ ఇచ్చారు.

దీంతో అంతా సన్నీని టార్గెట్ చేశారు. సిరి, షణ్ముఖ్,లోబో,విశ్వలు కత్తిపోటు పొడవటంతో సన్నీ ఎమోషన్ అయ్యాడు. మానస్, కాజల్ ..శ్వేతకి కత్తిపోటు వేశాడు. మొత్తంగా అందరికంటే తక్కువ కత్తిపోట్లు వచ్చిన శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్‌కి నాలుగో వారం కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.