బిగ్ బాస్ 5..జైల్లో మానస్!

140
bb 5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా నాలుగోవారంలోకి ఎంట్రీ కానుంది. ఇక మూడో వారం ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక 19వ రోజు ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సిరి, షన్ను, జెస్సీ అర్దరాత్రి ముచ్చట్లు పెట్టుకున్నావ్. నువ్ మాట్లాడకపోతే ఏదోలా ఉందని షన్నుతో సిరి తన బాధను చెప్పుకొంది. అయితే బాధపడు అని షన్ను కౌంటర్ వేశాడు. ఇక మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో శ్వేతా వర్మ రచ్చ చేసింది. తనను కిచెన్ వర్క్ చేయనివ్వడం లేదని ..

అందరికీ వంట రావాలని, అందరూ వంట చేయాలని చెప్పుకొచ్చింది. ఆ తరువాత హమీద, మానస్ ఇద్దరు ముచ్చట్లలో లీనమై పోయారు. హమిదకు చపాతి తినిపించిన ఘటన గేర్తు చేశాడు. నువ్ అడిగావ్ కదా? లహరికి చెప్పాను. డైనింగ్ టేబుల్ వద్దకు వస్తే.. నీకు, హమీదకు తినిపిస్తాను అని చెబితే.. రానంది. ఇక్కడే ఉండి.. ఇంకో చపాతి తినిపించాలని పట్టుబట్టింది అంటూ లహరి చేష్టల గురించి హమీదకు మానస్ చెప్పేశాడు.

ఇక గార్డెన్ ఏరియాలో సన్నీ, రవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ముచ్చట్లు పెట్టుకున్నారు. అది కాస్తా సన్నీ, నటరాజ్ మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ అయిన అతికిందంటే అదృష్టమే అనే టాస్క్‌లో విశ్వ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. బాల్‌లను విసరాలి.. అవి అతుక్కుంటే దాని మీద ఉన్న ఫుడ్ ఐటంలను లభిస్తాయని చెప్పాడు. కానీ విశ్వ మొదటిసారిగా వేసిన బాల్స్‌ అన్నీ కూడా మిస్ అయ్యాయి. సన్నీ, యాంకర్ రవి, శ్రీరామ చంద్ర వేసిన బంతులు అతుక్కున్నాయి.

ఇక బెస్ట్ వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ చెప్పగా అంతా మాసన్ పేరు చెప్పగా ఆయన్ని జైల్లో వేశారు బిగ్ బాస్. దీంతో ప్రియాంక కాస్త హ్యాపీగా, కాస్త బాధగా ఫీలైంది. ను వ్ లోపల ఉన్నావ్ కదా? హమీదకు ఎవరు తినిపిస్తారు అని ప్రియాంక సెటైర్ వేసింది.

ఎలిమినేషన్ గురించి సిరి, రవి, కాజల్ మాట్లాడుకున్నారు. పీ (ప్రియాంక), పీ (ప్రియ)లో ఎవరో ఒకరు వెళ్లిపోతారు అని అనిపిస్తోందంటూ సిరి చెప్పింది. హమీద, కాజల్ ముచ్చట్లు పెడుతూ శ్రీరామ్ పెట్టిన ముద్దు గురించి చెప్పుకొచ్చింది. తన కప్పు కడిగాడు అని హమీద చెబుతూ.. ఆ తరువాత వచ్చి భుజం మీద ముద్దు పెడితే.. ఇంకో భుజం మీద కూడా పెట్టు అని అన్నట్టు హమీద తెలిపింది.

నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం వేడుకలను కంటెస్టెంట్లకు చూపించాడు. దీంతో నటరాజ్ మాస్టర్ తెగ ఎమోషనల్ అయ్యాడు. హమీద, శ్రీరాంలు కాసేపు మనసు విప్పి మాట్లాడుకోగా హమీద తన మనసులోని ప్రేమను చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపించింది.

- Advertisement -