బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 100 హైలైట్స్

37
sriram

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 100వ ఎపిసోడ్‌లో భాగంగా ఫైనల్ కంటెస్టెంట్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ 100 రోజుల జర్నీని చూపిస్తూ వారికి జీవితంలో మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్‌ని అందించారు.

తొలుత మానస్-సన్నీలు టైటిల్ కోసం ముచ్చటించుకున్నారు. టైటిల్ ఎలాగైనా గెలివాలి.. మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్.. ఏదైనా చేయనియ్.. బరాబర్ ఇస్తా అని తెలిపాడు సన్నీ. ఇక షణ్ముఖ్.. సిరితో మాట్లాడుతూ.. అందరికీ క్లియర్ చేసుకోవాల్సింది ఏంంటంటే.. నీకు దెబ్బతగిలిన తరువాత నేను మిగతా హౌస్ మేట్స్ ఎవర్నీ పట్టించుకోవడం లేదు.. నేను నిన్నే పట్టించుకుంటున్నాను… అది అలాగే కంటిన్యూ అయిపోయింది.. ఏది జరిగినా మన మంచికే అని చెప్పాడు షణ్ముఖ్. ఇంతలో శ్రీరామ్ రావడంతో మాట మార్చేశాడు.

మొదటగా ఫైనల్‌కి చేరిన తొలి ఫైనలిస్ట్ శ్రీరామ్‌ని సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. తన జర్నీ మొత్తంలో ఇంటి సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను ఫొటోల ద్వారా చూపించారు బిగ్ బాస్. తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు శ్రీరామ్.. నా జీవితంలో చాలా హ్యాపీగా ఉన్న రోజు ఇదే.. నన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చిన ప్రేక్షకులకు పాదాభివందనం చేశారు శ్రీరామ్.