పుకార్లను నమ్మొద్దు : సమంత మేనేజర్

29
sam

సోషల్ మీడియాలో సమంతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు ఆమె మేనేజర్. కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన సమంత అస్వస్థతకు గురైంది. జ్వరం, జలుబు, దగ్గుతో ఆమె బాధపడుతున్నట్టు, చికిత్స కోసం నిన్న ఉదయం హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.

అయితే దీనిపై సోషల్ మీడియాలో సమంతకు కరోనా అంటూ తప్పుడు ప్రచారం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైందని ప్రచారం చేశారు. దీనిపై అంతా ఆందోళన చెందడంతో క్లారిటీ ఇచ్చారు సమంత మేనేజర్. ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆమె ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దని వెల్లడించారు.