బిగ్ బాస్ 5…ఫైనల్ కంటెస్టెంట్స్‌ వీరే!

129
bigg boss 5

తెలుగు బుల్లితెరపై సూపర్‌డూపర్ హిట్ అయిన మోస్ట్ అవేటైడ్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటివరకు 4 సీజన్‌లు పూర్తి చేసుకుని త్వరలోనే సీజన్ – 5 రాబోతుంది. నాగార్జున హోస్ట్ చేసిన సీజన్‌ – 4 ఉర్రూతలూగించడంతో సీజన్ – 5 పై కూడా నిర్వాహకులు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

గత సీజన్ – 4 లో కంటెస్టెంట్ల విషయంలో తొలుత మిక్స్‌డ్ ఒపీనియన్స్ వచ్చినా..షో సాగుతున్న కొద్ది కంటెస్టెంట్లంతా ఫుల్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు బిగ్‌బాస్ – 5 సీజన్‌ కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్ అంతే జాగ్రత్తలు తీసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 మొదలవుతుందని వార్తలు వచ్చిన ప్రతిసారి కంటెస్టెంట్స్ లిస్ట్‌పై సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి.

అయితే తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్‌లోకి వెళ్లే కొద్దిమంది పేర్లు బయటకువచ్చాయి. వీరిలో యాంకర్ రవి, యాంకర్ లోబో, షణ్ముఖ్‌ జశ్వంత్, వీజే సన్నీ, అనీ మాస్టర్,లహరి సహ్రి,సరయు,మనాస్,ఆర్కే కాజల్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5కి సంబంధించిన ఏ వార్తైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.