బిగ్ బాస్ 5…రెండో ప్రొమో వచ్చేస్తోంది..!

53
bigg boss

బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో 4 సీజన్‌లు పూర్తి చేసుకోగా 5వ సీజన్‌ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈ సారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనుండగా సెప్టెంబర్ 5 నుండి 5వ సీజన్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్పటికే 5వ సీజన్‌కి సంబంధించి విడుదల చేసిన ప్రొమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా రెండో ప్రొమోని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా అందన సమాచారం ప్రకారం ఈ నెల 28న సెకండ్ ప్రొమో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే వారు ఎవరా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రకరకాల పేర్లు టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గ్రేట్ తెలంగాణకు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం యాంకర్ రవి, యాంకర్ లోబో, షణ్ముఖ్‌ జశ్వంత్, వీజే సన్నీ, అనీ మాస్టర్,లహరి సహ్రి,సరయు,మనాస్,ఆర్కే కాజల్ ఈసారి హౌస్‌లోకి వెళ్లనున్నారు. ఇక షో ప్రారంభంకావడానికి టైం దగ్గర పడటంతో ఇప్పటికే కంటెస్టెంట్‌లు ఎంపికైన వారు క్వారంటైన్‌లోకి పంపించినట్లు సమాచారం. మొత్తంగా టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌పై దృష్టిసారించారు షో నిర్వాహకులు.