బిగ్ బాస్ తెలుగు 5..కెప్టెన్‌గా అనీ మాస్టర్‌

159
anee
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సక్సెస్‌ఫుల్‌గా ముందుకుసాగుతోంది. వచ్చేవారం కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్‌లో విలన్ టీం గెలవడంతో ఆ టీం సభ్యులకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. ఇందుకోసం చిక్కకు దొరకకు అనే టాస్క్ ఇచ్చారు. విలన్స్‌ జట్టు సభ్యులు వెల్‌క్రో జాకెట్‌ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది. బజర్‌ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలని తెలిపారు.

ఆసక్తికరంగా జరిగిన టాస్క్‌లో అనీ మాస్టర్‌కు తక్కువ బంతులు అంటుకోవడంతో కెప్టెన్‌గా నిలిచింది. ఇక మళ్లీ సిరి,షణ్ముఖ్‌ మధ్య ఈ టాస్క్ సందర్భంగా పెద్ద యుద్ధం జరిగింది. కెప్టెన్‌ షణ్ముఖ్‌ తనపై బంతులు విసరడాన్ని సిరి జీర్ణించుకోలేకపోయింది. బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ, కూర్చొంది. సర్ది చెప్పేందుకు షణ్ముఖ్ ప్రయత్నించగా షణ్ముఖ్‌పై గట్టిగా అరిచింది.

తర్వాత సిరి, రవి ఇద్దరు సిరికి మద్దతివ్వగా తాను ఎవరినీ కావాలని కొట్టలేదు. నా వ్యక్తిగతంగా గేమ్‌ ఆడా. అలా ఆడకపోతే, గ్రూప్‌గా ఆడుతున్నావ్‌ అని మీరే అంటారు అని షణ్ముఖ్ కౌంటర్‌ ఇచ్చాడు. తర్వాత దీపావళి సంబరాల్లో మునిగి తేలారు ఇంటి సభ్యులు.

ఇక ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది జెస్సీకి ప్రియాంక ముద్దు పెట్టడం. జెస్సీకి ప్రియంక వెన‌క నుండి హ‌గ్ ఇవ్వ‌గా, జెస్సీ ఆమె బుగ్గ‌పై ముద్దు పెట్టేశాడు. సడెన్‌గా జెస్సీ ఇలా ముద్దు పెట్టేస‌రికి ప్రియాంక షాక్‌లో ఉండిపోయింది. ముద్దు పెట్టావా అని ప్రియాంక‌ని స‌న్నీ అడ‌గ‌గా, ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను.. ఫటక్‌ అని ముద్దు పెట్టేశాడు అని చెప్పి చెత సిగ్గుపడిపోయింది ప్రియాంక.

- Advertisement -