బిగ్ బాస్ 5: ఎపిసోడ్ 97 హైలైట్స్

112
- Advertisement -

బిగ్ బాస్ 5 తెలుగు చివరి దశకు చేరుకునే కొద్ది ఆసక్తికరంగా మారింది. హౌస్‌మేట్స్‌ సూపర్ స్టార్లుగా నటించాల్సిన టాస్కులో అందరూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇరగదీశారు. సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, పవన్‌ కల్యాణ్‌గా మానస్‌, చిరంజీవిగా శ్రీరామ్‌, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్‌ అదరగొట్టారు. కానీ అందరికంటే ఎక్కువగా కాజల్‌ తన పాత్రలో లీనమై అందరినీ ఆకట్టుకుంది. దీంతో హౌస్‌మేట్స్‌ ఆమెను బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. అందరి ఏకాభిప్రాయంతో ఎంపికైన కాజ‌ల్‌.. ‘ఓట్ ఫర్ మి’ ద్వారా ప్రేక్షకుల్ని ఓట్లు వేయ‌మ‌ని రిక్వెస్ట్ చేసింది. ‘డే 1 నుంచి నేను ఎలా ఉన్నానో చూస్తున్నారు.. బిగ్ బాస్‌కి రావడం అనేది నా డ్రీమ్.. నా డ్రీమ్‌ నెరవేరింది.. టాప్ 5కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాను.. నా ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లకు కూడా ఓటు వేయండి.. వాళ్లతో పాటు టాప్ 5‌లో ఉంటే.. నా కల నెరవేరినట్టే.. దయచేసి మాకు ఓటు వేసి సపోర్ట్ చేయండి’ అని ప్రేక్షకుల్ని ఓట్లు అభ్యర్ధించింది కాజల్.

ఈ టాస్క్ పూర్తైన త‌ర్వాత బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కి మ‌రో టాస్ ఇచ్చారు. మీపై ప్రేమ కురిపించే అభిమానుల‌లో ఎన్నో ప్ర‌శ్న‌లు ఉన్నాయి. వాటిని మీతో నేరుగా పంచుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవగానే అది ఎవర్నైతే అడిగారో వారు దానికి బదులివ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ముసుగు వేసుకోకుండా సమాధానాలు చెప్పినవారు ఓట్‌ ఫర్‌ అప్పీల్‌కు అవకాశం పొందుతారు అని చెప్పారు బిగ్ బాస్. దీంతో అంద‌రు హౌజ్‌మేట్స్ ముసుగు లేకుండా స‌మాధానాలు చెప్పారు.

1వ ప్రశ్న: మీరు షణ్ను కన్నా స్ట్రాంగ్‌ ప్లేయర్‌. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్‌సైడర్‌ చేసుకోవడం లేదు?

సిరి: నేను స్ట్రాంగ్‌ ప్లేయర్‌నే. కాకపోతే కొన్ని సంఘటనల్లో షణ్ను నాకు తోడుగా ఉన్నాడు, ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తాను. ఒక ఫ్రెండ్‌గా నేను వాడిని ఫస్ట్‌ ప్లేస్‌లో చూడాలనుకున్నాను.

2వ ప్రశ్న: అనీ మాస్టర్‌తో రెస్పెక్ట్‌ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం రెస్పెక్టా?

కాజల్‌: సన్నీ దగ్గర నాకు చనువుంది, అతడంటే నాకు చాలా గౌరవం. అది సరదా గొడవలో చేశాను.

3వ ప్రశ్న: గిల్టీ బోర్డ్‌ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్‌ అయ్యారు? ఆ ఇన్సిడెంట్‌ తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ను ఎలా తిరిగి పొందారు ?

సన్నీ: గిల్టీ బోర్డ్‌ వేసుకోవడమనేది ఈ సీజన్‌లోనే నేను బాగా హర్టయిన సంఘటన. గిల్టీ అనే పదానికి దరిదాపుల్లో కూడా వెళ్లకూడదనుకున్నాను. అద్దంలో చూసుకుంటూ నాలో నేను కాన్ఫిడెన్స్‌ నింపుకుంటాను.

4వ ప్రశ్న: జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ను ఇమ్మెచ్యూర్‌ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్‌ టాస్క్‌లో మీరే షణ్ను మెచ్యూర్‌ అని, తనను సెకండ్‌ ప్లేస్‌లో పెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ను గ్రూపులో ఉన్నారా?

శ్రీరామ్‌: ఇప్పుడు తెలిసిన షణ్ముఖ్‌ వేరు.. ప్రస్తుతం షణ్ను చాలా మెచ్యూర్‌.

5వ ప్రశ్న: ఆడియన్స్‌ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా?

మానస్‌: వాడుకోవడమనేది రాంగ్‌. జన్యున్‌గా కనెక్ట్‌ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడు? ఫ్రెండ్స్‌ సేవ్‌ చేసినప్పుడు సన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ చూసుంటే మీకు అర్థమవుతుంది. నాకెప్పుడూ అతడు వాడుకోవాలనిపించలేదు.

6వ ప్రశ్న: సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్‌ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్‌ చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు?

షణ్ను: ఇది నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానని నాకూ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను కంట్రోల్‌ చేస్తే బెటర్‌ అని, మిగతా కొన్నింటిలో ఆమె ఆమెలా ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కానీ ఏది కంట్రోల్‌ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానో నాకే తెలియడం లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తనమీద ఎవరైనా గేమ్‌ ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్‌ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్‌ 5లో చూడాలనుకుంటున్నాను.

అందరిముందు కాజల్‌ను ఎందుకు హ్యుమిలియేట్‌ చేస్తారు? స్టాండ్‌ తీస్కొని మీకోసం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తను విన్‌ అయింది

సన్నీ: మేం ఫ్రెండ్స్‌. మీకలా అనిపించిందంటే ఇంకా ఎక్కువ చేస్తాను.

రవిని నామినేట్‌ చేశారు, ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనే పేరు కూడా పెట్టారు. మరి టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో మేం నీకోసం ఆడుతున్నాం రవి , మిస్‌ యూ రవి అని అనడం కరెక్ట్‌ అనుకుంటున్నారా?

సిరి: మనిషి పక్కన ఉన్నప్పుడు అతడి వాల్యూ తెలియలేదు. నన్ను చెల్లెలిగా చూస్తూ ఏడిపిస్తాడు. రవి సడన్‌గా ఎలిమినేట్‌ అవడంతో షాక్‌లోకి వెళ్లిపోయా. టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో రవి గుర్తొచ్చాడు, అతడి కోసం ఆడాలనిపించింది.

మీరు ప్రియాంక మీ ఫ్రెండ్‌ అనుకున్నప్పుడు తనని బ్యాక్‌బిచ్‌ ఎందుకు చేశారు?
మానస్‌: ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని నేను షేర్‌ చేసుకుంటాను. కానీ నేనెప్పుడూ ఆమె మంచి కోరేవాడినే! కానీ నా ఇంటెన్షన్‌ మాత్రం అది కాదు

మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?

కాజల్‌: మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్‌ అయ్యాను. కానీ కొన్ని సంభాషణల వల్ల మా మధ్య దూరం పెరిగింది. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్‌ రాలేదు. మానస్‌, సన్నీలతో కనెక్ట్‌ అయ్యాను. ఆట కోసం ఈ కనెక్షన్స్‌ పెట్టుకోలేదు

ఆడియన్స్‌కు ఇవెలా నచ్చుతాయి? అవెలా నచ్చుతాయని ఆడియన్స్‌ను ఎందుకు జడ్జ్‌ చేస్తున్నారు? వారిపై ఫన్‌ ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు షణ్ముఖ్‌ తానైతే ప్రేక్షకుల మీద ఫన్‌ చేయట్లేదని సమాధానమిచ్చాడు. మొదటి నుంచీ గ్రూప్‌లోనే ఆడుతున్నా మిమ్మిల్ని మీరు లోన్‌ రేంజర్‌లా ప్రొక్లైం చేసుకున్నారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌లో మీరు, రవి ఇద్దరూ ఇద్దరి ఫొటోలు కాల్చేయలానుకున్నారు. కానీ కాజల్‌ ఆ పని చేస్తే మాత్రం ఆగ్రహించారు? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా అందరితో కలిసుండాలనుకున్నా, కలిసి ఆడాలనుకున్నానంటూ సింపుల్‌గా తేల్చేశాడు. గేమ్‌ ఎథికల్‌గా ఆడకపోతే కోపమొస్తుందని తెలిపాడు.

మొత్తానికి ఈ ప్రశ్నోత్తరాల టాస్కులో ఎలాంటి ముసుగు లేకుండా అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చింది సిరి, సన్నీ అని హౌస్‌మేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఓట్లు అడిగే అవకాశాన్ని సన్నీ కోసం సిరి జాడవిరుచుకుంది. దీంతో సన్నీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. ‘నేను అగ్రెసివ్‌ కాదు, టాస్కుల్లో 100 % ఇస్తున్నాను. నాకోసం కప్పు గెలుచుకురారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్‌ చేయండి. ప్లీజ్‌ వోట్‌ ఫర్‌ మీ..’ అని కోరాడు.

- Advertisement -