ట్రెండింగ్‌లో సమంత ఐటం సాంగ్..

55
Samantha item song

అల్లు అర్జున్‌-సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం పుష్ప. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ జనాదరణ పొందాయి.. ఇక నిన్న విడుద‌లైన స‌మంత ఐటమ్‌ సాంగ్ ఉ అంటావా.. ఊహూ అంటావా.. పాట కూడా ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది.

హస్కీగా సాగే ఈ పాట యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌తో పాటు 3 లక్షల లైకులు కూడా సొంతం చేసుకుని, మరింతగా దూసుకుపోతోంది. ఈ సాంగ్‌ను పలు భాషల్లో రూపొందించారు. తెలుగులో ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ గీతాన్ని కొత్తమ్మాయి ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ ఇంద్రావతి గొంతుకలో ఈ ఐటం పాట మరింత కొత్తగా ధ్వనించింది.

Oo Antava..Oo Oo Antava (Telugu)Lyrical |Pushpa Songs |Allu Arjun,Rashmika |DSP |Sukumar | Samantha