బిగ్ బాస్ 5..మళ్లీ రెచ్చిపోయిన సిరి

122
bb5
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5..13వ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. 13వ వారంలో భాగంగా ఐదుగురు నామినేట్ కాగా సిరి మళ్లీ హాగ్ గేమ్ స్టార్ట్ చేసింది. తొలుత ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ఎగ్జిట్ తలుపు తెరిచిన బిగ్ బాస్.. ఆ ఎగ్జిట్ గుమ్మంలో నుంచి ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫొటోలతో ఉన్న బాల్స్‌ని తన్నాలని.. ఒక్కొక్కరు ఇద్దరిద్దని నామినేట్ చేయాలని చెప్పారు.

మొదటగా షణ్ముఖ్.. కాజల్‌ని తర్వాత ప్రియాంకను నామినేట్ చేశారు. ఇక ప్రియాంక ఎవరిని నామినేట్ చేయాలో తెలియక కాసేపు ఆగిన తర్వాత బిగ్ బాస్ హెచ్చరికతో తొలుత సిరిని, తర్వాత కాజల్‌ని నామినేట్ చేసింది. శ్రీరామ్.. మానస్‌ని, కాజల్‌ని నామినేట్ చేశారు.

సిరి.. ప్రియాంకను కాజల్ ను నామినేట్ చేసింది. ఇక కాజల్‌ని నామినేట్ చేస్తూ షణ్ముఖ్ ఏదైనా రీజన్ చెప్పాడో.. కమ్యునిటీ అనే రీజన్‌ని చెప్పింది. సన్నీ తన ఫ్రెండ్స్‌గా ఉన్న కాజల్, మానస్, ప్రియాంకలను చేయలేను కాబట్టి.. మిగిలిన వాళ్లలో సిరి, శ్రీరామ్‌లు ఇద్దరే ఉన్నారు. వీళ్లు తప్ప నాకు ఆప్షన్ లేదు కాబట్టి అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు.

తర్వాత మానస్.. శ్రీరామ్‌ని నామినేట్ చేసి దెబ్బకి దెబ్బ కొట్టాడు.తర్వాత కాజల్…కమ్యునిటీ అనే పదం ఉపయోగించినందుకు గానూ.. తనని నామినేట్ చేయడం పట్ల ఎమోషనల్ అయ్యింది. ప్రియాంక కెప్టెన్ కాలేదని తన కోసం స్టాండ్ తీసుకుని షణ్ముఖ్‌ని కన్వెన్స్ చేయడానికి కమ్యునిటీ అనే పదాన్ని వాడితే దాని కోసం తిరిగి ప్రియాంకే నన్ను నామినేట్ చేసింది. కమ్యునిటీ అంతే తప్పుకాదు. గ్రాఫ్ ఆఫ్ పీపుల్‌ని కమ్యునిటీ అంటారు. నేను ఎవర్నీ కించపరచడానికి అనలేదు అని చెప్పుకొచ్చింది. అందుకే ప్రియాంక, సిరిలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది కాజల్.

మొత్తంగా 12 వారం నామినేషన్స్‌లో.. సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ ఈ ఐదురుగు నామినేట్ అయ్యారు. ఇక తర్వాత మళ్లీ హాగ్‌ గేమ్ స్టార్ట్ చేసింది సిరి. షణ్ముఖ్ ఆమె పరువుని దారుణంగా తీసిపారేసినా.. తర్వాత సారీ చెప్పడంతో హాగ్ ఇవ్వడం ఎపిసోడ్‌కు హైలైట్.

- Advertisement -