ట్విట్టర్ సీఈవోగా ప్రవాస భారతీయుడు..

184
twitter
- Advertisement -

ట్విట్టర్ సీఈవోగా నియమితులయ్యారు ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్. సీఈ‌వోగా ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా ఎన్ను‌కుంంది.

ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయం పూర్వ విద్యార్థి అయిన పరాగ్‌ అగ‌ర్వాల్‌.. పదేండ్ల క్రితం ట్విట్ట‌ర్‌లో యాడ్స్‌ ఇంజి‌నీ‌ర్‌గా చేరారు. అంచె‌లం‌చె‌లుగా ఎదు‌గుతూ 2017లో సంస్థ టెక్నా‌లజీ అధి‌ప‌తిగా పదో‌న్నతి పొందారు. ఈ బాధ్యత నాకు రావ‌డం‌పట్ల గర్వ‌ప‌డు‌తు‌న్నాను. డోర్సే మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని కొన‌సా‌గి‌స్తాను. ఆయన స్నేహా‌నికి కృత‌జ్ఞ‌తలు అని తెలిపారు పరాగ్.

2006లో మరో ముగ్గు‌రితో కలిసి డోర్సే ట్విట‌ర్‌ను స్థాపిం‌చిన విషయం తెలి‌సిందే. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి‌దాకా ట్విట్టర్‌ సార‌థిగా డోర్సేనే కొన‌సా‌గు‌తు‌న్నారు. దాదాపు 16 ఏండ్ల అనం‌తరం సంస్థకు కొత్త సీఈవోగా ఓ భారతీయుడికి అవకాశం లభించడం విశేషం.

- Advertisement -