బిగ్ బాస్ 5: మానస్‌- సిరి ఎలిమినేట్‌..!

113
- Advertisement -

సెప్టెంబర్ 5న మొదలైన బిగ్ బాస్ 5 తెలుగు అప్పుడే చివరి దశకి చేరుకుంది. ఈరోజు జరగబోయే గ్రాండ్ ఫినాలేకి అన్ని ఏర్పాట్లు ముగిసాయి. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఫినాలేకు చేరుకున్న ఐదుగురులో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మానస్‌, సిరి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారని తెలుస్తోంది. ఫైనలిస్టుల్లో నుంచి ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే ప్రక్రియను ఒకరోజు ముందుగానే అంటే శనివారమే షూట్‌ చేశారు.

ఈ క్రమంలో టైటిల్‌ రేసు నుంచి మొదటగా సిరి తప్పుకుందని లీకులు వచ్చాయి. తర్వాత నాలుగో స్థానంలో మానస్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ సుకుమార్‌ డ్రోన్ల ద్వారా సిరి ఎలిమినేషన్‌ను ప్రకటించగా హీరోయిన్‌ సాయిపల్లవి చేతుల మీదుగా మానస్‌ ఎలిమినేషన్‌ను వెల్లడించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వస్తుండటంతో ఈ ఎలిమినేషన్స్‌ కూడా నిజమయ్యే ఉంటుందని నమ్ముతున్నారు ఆడియన్స్‌.

పైగా అనధికారిక ఓటింగ్‌లోనూ మానస్‌, సిరి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్నప్పుడు సిరి, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మానస్‌ ఎలిమినేట్‌ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైనట్లు కనిపిస్తోంది. కాకపోతే మానస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు బిగ్‌బాస్‌ రూ.10 లక్షలు ఆఫర్‌ చేయగా దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను రెట్టింపు చేస్తే టాప్‌ 3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు తీసుకునే అవకాశం ఉందనేది ఈ రోజు సాయంత్రం జరిగే గ్రాండ్ ఫినాలే చూస్తే తెలిసిపోతుంది.

- Advertisement -