బిగ్ బాస్ 4…ఈ వారం నామినేషన్‌లో 9 మంది!

241
bigg boss 4

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 30 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సోమవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కావడంతో ఈ వారం ఎలిమినేషన్‌లో ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై ఫోమ్ (నురుగ)ను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని కోరారు బిగ్ బాస్.

అలా ఇంటి సభ్యులందరూ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలపగా ఈ సందర్భంగా ఎపిసోడ్ ఆధ్యంతం రచ్చ రచ్చగా సాగింది. సభ్యులంతా తమ అభిప్రాయాలను తెలిపిన అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన వారి పేర్లను తెలిపారు.

ఎక్కువ మంది అఖిల్,నోయల్,అమ్మ రాజశేఖర్ మాస్టర్ పేర్లను తెలిపారు. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్‌కు 9 మంది నామినేట్ అయ్యారు. అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు ఉండగా వీరిలో ఎవరూ హౌస్ నుండి బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.