రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కుల అభివృద్ధి: కేటీఆర్

280
ktr
- Advertisement -

సీఎం కేసీఆర్‌ని మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎవరులేరన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్….అర్బ‌న్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో 1893 అభివృద్ధి చెందిన‌ అర్బ‌న్ పార్కులు ఉన్నాయ‌ని…ఈ పార్కుల‌తో పాటు అద‌నంగా మ‌రో 1799 అర్బ‌న్ పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించామ‌ని వెల్లడించారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మ‌రికొన్నింటిని ల్యాండ్ స్కేప్, అర్బ‌న్‌, పంచ‌త‌త్వ పార్కులుగా అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించ‌మ‌న్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మున్సిపాలిటీ బ‌డ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌ను పెట్టామని… ప‌ట్ట‌ణ హ‌రిత ప్ర‌ణాళిక రూపొందించుకుని మొక్క‌లు నాటుతున్నార‌ని తెలిపారు. రాష్ర్టంలో గ్రీన్ క‌వ‌ర్ 29 శాతానికి పెరిగింద‌న్నారు. ఈ ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు. జీహెచ్ఎంసీ పార్కుల్లో స్థ‌లం ఉంటే అక్క‌డ ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -