బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా రెండోసారి కెప్టెన్ అయ్యారు నోయల్. కొట్టు- తలతో ఢీ కొట్టు అనే టాస్క్‌లో భాగంగా తలకి బ్యాట్ హెల్మెట్ ధరించి..బ్యాట్ హెల్మెట్ ధరించి తమకు చెందిన బాల్స్‌లో గోల్ నెట్‌లో వేయాల్సి ఉంటుందని ఎక్కువ బాల్స్ నెట్‌లో ఎవరు వేస్తే వాళ్లే విజేతగా నిలవడంతో పాటు అతనే హౌస్ కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌కి అవినాష్‌ని సంచాలకుడిగా నియమించారు బిగ్ బాస్.
అత్యధికంగా నోయల్ బాల్స్ గోల్ చేయడంతో రెండోసారి హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు నోయల్. అయితే అమీతుమీ టాస్క్‌లో నేరుగా నామినేట్ అయిన కారణంగా వచ్చేవారం ఇమ్యునిటీని కోల్పోయాడు నోయల్. నామినేషన్స్‌లో కూడా సేఫ్ కాదుని చెప్పారు బిగ్ బాస్.
దీంతో కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు నోయల్. నాన్నా నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు.. తొడకొట్టు నాన్నా అంటూ కేకలుపెట్టి బిగ్ బాస్ హౌస్‌లో తొడకొట్టాడు . హౌస్‌కి కొత్తగా కెప్టెన్ అయిన నోయల్‌కి రేషన్ మేనేజర్‌ని ఎంపిక చేసే అవకాశం ఇవ్వడంతో.. మోనాల్, లాస్య, మెహబూబ్‌లు పోటీ పడ్డారు. అయితే మెహబూబ్ తనకు కెప్టెన్సీ టాస్క్‌లో హెల్ప్ చేశాడు.. అందుకే మెహబూబ్‌ని రేషన్ మేనేజర్‌ని చేస్తున్నట్టు చెప్పాడు నోయల్.