- Advertisement -
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 28 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా స్వాతి దీక్షిత్ ఇంటి నుండి బయటికి రాగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హింట్ ఇచ్చారు నాగ్.
గన్ షూట్‌లో భాగంగా గన్ ఇచ్చి షూట్ చేసుకోవాలని సౌండ్ కాకుండా గన్ షాట్ వస్తే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు అని నాగార్జున తెలిపారు. తొలుత కుమార్ సాయి తర్వాత హారిక గన్ షూట్ చేసుకోగా వీరిద్దరూ సేవ్ అయ్యారు.
దీంతో అభిజిత్‌తో పాటు ఇంటి సభ్యులు హారిక సేవ్ కావడం పట్ల చప్పట్లు కొట్టగా నాగార్జున చప్పట్లు కొట్టాల్సింది ఏం లేదు.. ఎవర్నీ సేవ్ చేయట్లేదు.. ఇది ఓన్లీ ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చారు.దీంతో ఇవాళ మిగిలిన ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో లేదా గతవారం ఇచ్చిన విధంగానే నాగార్జున ట్విస్ట్ ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
- Advertisement -