బిగ్ బాస్ ఎపిసోడ్ 28..స్వాతి దీక్షిత్ ఔట్

273
swathi

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 28 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. శనివారం ఎపిసోడ్ కావడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇవ్వడం,స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కావడం,అభిజిత్‌- మొనాల్ ట్రాక్‌కి బ్రేక్ పడటం,కిల్లర్ కాయిన్స్ ట్రాక్‌ గురించి చర్చించడంతో ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు కింగ్ నాగ్.

దొంగా దొంగా వచ్చాడే అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్. ఇంట్లో అందరూ దొంగలే.. ఎవరు మంచి దొంగో.. ఎవరు భలే దొంగో తేల్చేసుకుందాం అంటూ మన టీవీ ద్వారా చూపించారు. మొనాల్‌తో అఖిల్,హారికతో అభిజిత్ ముచ్చట్లు పెట్టారు. ఇంటి సభ్యులు రెండు టీంలుగా విడిపోయి.. ఫర్ఛ్యూన్ ఆయిల్‌తోవివిధ రకాల వంటకాలు చేయాలని ఆ వండిన వంటకాలు తినడానికి ఇద్దరు తినేవాళ్లను ఎన్నుకొని డాన్స్ చేస్తూ ఆ ఈటర్ ఆ వంటకాలన్నింటినీ తినాలని ఎక్కువ సేపు తింటూ ఎక్కువ తిన్నవాళ్లే విన్నర్ అని ప్రకటిచారు బిగ్ బాస్. ఈ పోటీలో మెహబూబ్‌,సాయి తలపడగా సాయి విన్నర్‌గా నిలిచాడు.

మొనాల్‌ తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తుండటంతో అభినందించారు నాగ్‌. కిల్లర్ కాయిన్స్‌ టాస్క్‌లో భాగంగా ఎవరు ఏవేవి తప్పులు చేశారో బోన్‌లో ఉంచి పోలీస్ ఆఫీసర్‌గా ప్రశ్నించాలని అడిగారు నాగ్. తొలుత అరియానా…………..అమ్మా రాజశేఖర్‌ని బోనులో నిలబెట్టి ఆయన చేసిన తప్పుల్ని ఎండకట్టింది. రాజశేఖర్ తరుపున అవినాష్ డిఫెన్స్ చేసి వాదించగా ఇంటి సభ్యులంతా ఆయన నిర్దోషి అని చెప్పారు. తర్వాత సుజాత, రాజశేఖర్ మాస్టర్‌లు సొహైల్‌ని దోషిని చేసే ప్రయత్నంగా చేయగా ఆయన్ని నిర్దోషిగా తేల్చారు ఇంటి సభ్యులు.

తర్వాత హారిక, అభిలను నిలబెట్టి మరీ క్లాస్ పీకారు నాగార్జున. మొనాల్‌కి తెలుగు రాకపోయినా మాట్లాడటానికి ట్రై చేస్తోంది కానీ మీకు తెలుగు వచ్చినా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు అంటూ ఇంకోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడితే శిక్షలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు నాగ్.దీంతో ఇకపై తెలుగులోనే మాట్లాడతాం.. క్షమించండి అంటూ దండం పెట్టారు అభి, హారిక.

ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్‌. గన్ ఇచ్చి షూట్ చేసుకోవాలని సౌండ్ కాకుండా గన్ షాట్ వచ్చిన వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పగా స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది. ప్రతివారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ.. చివర్లో ఎలిమినేట్ చేసేశారు. అయితే ఈసారి ఎవర్నీ సేవ్ చేయకుండా స్వాతి దీక్షిత్‌ని ఎలిమినేట్ చేసిన నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఇది కేవలం ఎలిమినేషన్ మాత్రమే అని ఎవర్నీ సేవ్ చేయాలేదని చెప్పారు నాగార్జున. దీంతో ఇవాళ మరొకరు ఎలిమినేట్ అవుతారా లేదా గతవారం మాదిరిగానే నాగ్ ట్విస్ట్ ఇచ్చారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.