రూ.1500 తగ్గిన బంగారం ధర!

212
gold rate
- Advertisement -

బంగారం ధరలు కొద్దిరోజులుగా స్ధిరంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో బంగారం ధర రూ.1,500 పతనం కాగా వెండి కేజీకి రూ.7,700 తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.52,760కు చేరింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి రూ.48,370కు చేరింది. కేజీ వెండి ధర రూ.500 పెరిగి రూ.61,200కు చేరింది. బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం కావడంతో ప్రతికూల పరిస్థితుల్లో ధర పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతారు.

- Advertisement -