అభి నామినేషన్.. హారిక కంటతడి!

147
abhi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఏడవవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. ఇక అభిజిత్- హారిక మధ్య జరిగిన ఎలిమినేషన్‌ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం ఆరునామినేషన్స్‌లో ఐదు నామినేషన్స్‌లో ఉన్నా.. ప్రతిసారీ సేవ్ చేస్తూ వస్తున్నారు. సో నువ్ నామినేట్ అయితే బాగుంటుంది అని హారికతో చెప్పాడు అభిజిత్.

అయితే నాకంటే నువ్ ఒక నామినేషన్‌లో ఎక్కువ ఉన్నావ్ అంతే.. త్యాగాలు, కాంప్రమైజ్ అయ్యే వీక్ కాదు ఇది.ఇద్దరిలో ఎవరం ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పింది హారిక. ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్.. అభిజిత్ నిన్ను బ్లేమ్ చేయడం లేదు.. బిగ్ బాస్‌ని బ్లేమ్ చేస్తున్నా.. ఇద్దరిలో ఎవరు నామినేట్ అయినా అన్ ఫెయిర్.. నేను సేవ్ అయినా హ్యాపీగా ఉండలేను, నా నోటితో నామినేషన్‌కి నీ పేరు చెప్పలేను అభి అంటూ బాధపడిపోయింది. దీంతో వెనక్కితగ్గిన అభి…హారిక కోసం తనను తాను త్యాగం చేసుకుని ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు.

నామినేషన్స్ అనంతరం అమ్మా రాజశేఖర్‌తో నామినేషన్స్ గురించి చర్చించిన హారిక…. బిగ్ బాస్ నన్ను ఫ్యామిలీ కావాలా? అభిజిత్ కావాలా?అన్న పరిస్థితిలో పెట్టేశాడు, అభిజిత్ నా కోసం త్యాగం చేశాడు కాబట్టి తనకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి లేదంటే అన్ ఫెయిర్ అంటూ ఎమోషన్ అయింది.