మనసు గెలుచుకున్న అరియానా!

170
harika

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా ఏడవవారం ఎలిమినేషన్‌లో ఆసక్తికర టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న సభ్యుల్లో 10 మందిని జంటలుగా విడిపోయి ప్రతి జంటలో నుండి ఒకరు నామినేట్ కావాలని సూచించారు. దీంతో ఒక్కొక్కరుగా అవినాష్,అభి,మోనాల్,దివి నామినేట్ కాగా చివరగా అరియానా-మెహబూబ్ వంతు వచ్చింది.

అయితే అరియానా -మెహ‌బూబ్‌ల మ‌ధ్య అత్యంత ఆసక్తికరమైన చర్చ జ‌రిగింది. త‌నకు నామినేట్ కావ‌డం ఇష్టం లేద‌ని అరియానా .. త‌న‌కూ ఇష్టం లేద‌ని మెహ‌బూబ్ పోటా పోటీగా వాదించుకున్నారు. తాను ఎక్కువ సార్లు నామినేట్ అయ్యా … నా ప్రయత్నం నేను చేశా.. నేను చాలా బాగా ఆడాను.. నేను ఎందుకు నామినేట్ అవ్వాలి. నాకు హౌస్‌లో ఉండాలని ఉందని తెలిపింది అరియానా.

తర్వాత మెహబూబ్ మాట్లాడుతూ నువ్వూనేనూ నాలుగుసార్లు నామినేట్ అయ్యాం ఇద్దరం సమానమే నామినేషన్స్‌లో ఇద్దరం సమానమే అంటూ వాదించడడంతో చాలాసేపు చర్చ నడిచింది. చివరకు ఇంటి సభ్యులు కూడా ఇది ఇప్పట్లో తేలేలా లేదు అంటూ అలా చూస్తు ఉండిపోగా చివరికి అరియానా వెనక్కి తగ్గింది. నేను నామినేట్ అవుతున్నా బిగ్ బాస్.. కానీ నాకు మెహబూబ్ హెల్ప్ అవసరం లేదని చెప్పి నామినేట్ అయ్యింది.

అరియానా.. మెహబూబ్‌ కోసం త్యాగం చేసి రేంజ్ పెంచుకుందని.. మెహబూబ్ త్యాగం చేసి ఉంటే బాగుండేదని మిగతా ఇంటి సభ్యులు చర్చించుకోగా సొహైల్ సైతం అరియానా చేసిన పనికి ఇంప్రెస్ అయ్యారు.