మూడో కెప్టెన్‌గా గంగవ్వ!

149
Gangavva

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు 20 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక బిగ్ హౌస్‌లో మూడో కెప్టెన్‌గా ఎంపికైంది గంగవ్వ. తొలివారంలో లాస్య, రెండో వారంలో నోయల్ కెప్టెన్‌లుగా ఎంపిక కాగా మూడోవారం రంగుపడింది టాస్క్‌లో గెలిచి గంగవ్వ కెప్టెన్ అయింది.

ఉక్కు హృదయం టాస్క్‌లో గెలిచిన రోబో టీంలోని నలుగురు సభ్యులు అవినాష్‌,హారిక,అభిజిత్,గంగవ్వలకు రంగు పడుద్ది జాగ్ర‌త్త అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ అయిపోయే స‌మ‌యానికి ఎవ‌రి బౌల్‌లో ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లే గెలిచిన‌ట్లు అని బిగ్ బాస్ తెలిపాడు.

ఇంటి స‌భ్యులంద‌రూ ప‌గ‌ప‌ట్టిన‌ట్లు అభిజిత్‌, అవినాష్, హారిక పాత్ర‌లోని నీళ్ల‌ను మొత్తం కింద ప‌డేశారు అయితే ఏ ఒక్క‌రూ గంగవ్వ‌ను క‌నీసం ట‌చ్ కూడా చేయలేదు. దీంతో గంగవ్వ కెప్టెన్‌ అయింది. ఇప్పటివరకు హౌస్‌లో స్టార్‌గా ఉన్న గంగవ్వ కెప్టెన్‌గా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.