తన బాధలను గుర్తుచేస్తూ..గంగవ్వ కన్నీటి పర్యంతం

136
gangavva

బిగ్ బాస్ హౌస్‌లో స్టార్ కంటెస్టెంట్ గంగవ్వ. తాను బిగ్ హౌస్‌లోకి కేవలం ఉండటానికి ఇళ్లు కావాలని అందుకే వచ్చానని చెబుతూ తన బాధను వెళ్లగక్కింది గంగవ్వ. ప్రేక్షకులు సైతం గంగవ్వ లైఫ్ హిస్టరీ తెలుసుకుని ఆమెకు ఇప్పటివరకు మద్దతిస్తూ వస్తున్నారు. ఇందుకోసం గంగవ్వ ఆర్మీ కూడా ఏర్పడింది.

ఇక తాజాగా 34వ ఎపిసోడ్‌లో మార్నింగ్‌ మస్తీలో భాగంగా చనిపోయిన తన బిడ్డను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతం అయింది. ఇంటి సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేయగా కాసింత కూల్ అయింది.

తాను చదువుకోలేదు.. 5 ఏళ్లకే పెళ్లి చేశారు.. 15 ఏళ్లకు కొడుకు పుట్టాడని… కొడుకు పుట్టాక భర్త తాగుడు తాగి కొట్టడం మొదలుపెట్టడంతో కష్టాలు మొదలయ్యాయని తెలిపింది గంగవ్వ. తాగి రోజు కొట్టేవాడని తర్వాత రెండేళ్లకు పాప పుట్టిందని … ఆ టైంలో మస్కట్‌కి పోతా డబ్బులు తెమ్మన్నాడు.. సరే దెబ్బలైనా తప్పుతాయని అనుకున్నా..కానీ అదే టైంలో నా బిడ్డకు ఫిట్స్ వచ్చాయి.. బిడ్డను ఎత్తుకుని సర్కార్ ఆసుపత్రికి వెళ్లా.. డాక్టర్లు చూసి నీ బిడ్డ చనిపోయిందని చెప్పారు.. చనిపోయిన బిడ్డను భుజంపైనే వేసుకుని నడుచుకుంటూ వెళ్లా అంటూ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది గంగవ్వ.