లాక్‌డౌన్‌లో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా: అవినాష్‌

111
avinash

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 ఎపిసోడ్‌ 34లో భాగంగా మార్నింగ్ మస్తీలో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. నోయల్ తన అమ్మను గుర్తుచేసుకుని బాధపడిపోగా తర్వాత వచ్చిన అవినాష్‌ తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని బాంబు పేల్చారు.

తాను లైఫ్‌లో రెండే నమ్ముతా.. ఒకటి పేరెంట్స్ రెండు ఫ్రెండ్స్‌. వీరంతా నా ఫ్యామిలీ కిందే లెక్కేస్తానని తెలిపాడు. లాక్ డౌన్ సమయంలో ఇంటి ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపి షాకిచ్చాడు. ఈ మధ్యే కొత్తగా ఇళ్లు కొన్నాను.. దాని ఈఎంఐ నెలకు రూ.45 వేలు. అది కట్టలేని పరిస్థితిలో నాన్నకి హార్ట్ స్టోక్ వచ్చింది. స్టంట్స్ పడ్డాయి.. రూ. 4 లక్షలు ఖర్చు అయ్యింది. ఇంకో 13 లక్షలు బయట అప్పు చేశాను. అదే టైంలో అమ్మకి మోకాళ్లు అరిగిపోయాయి. దానికి కూడా డబ్బు అయ్యింది.

తాను అప్పులు చేసింది మా అమ్మానాన్న కోసం.. వాళ్లు బాగుండాలి అనుకున్నాను.. వాళ్లు బతికి ఉండగానే చూసుకోవాలి.. ఉన్నప్పుడే కాపాడుకోవాలి.. పేరెంట్స్‌ని రెస్పెక్ట్ చేయండి అంటూ ప్రేక్షకులకు దండం పెట్టి చెప్పాడు అవినాష్.