బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 81 హైలైట్స్

68
episode 81

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 81 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 81వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లో దెయ్యం హల్ చల్ చేయడం, అఖిల్ ..మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లడం ముఖ్యంగా అభిజిత్ కంటతడి పెట్టడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

తొలుత మార్నింగ్ వేకప్‌ సాంగ్‌కి ఇంటి సభ్యులంతా డ్యాన్స్ చేయగా తర్వాత సోహైల్ మర్చిపోయి పేస్ట్‌తో ఫేస్‌ వాష్ చేసి తిప్పలు పడ్డాడు. దీంతో అరియానా-అవినాష్ వచ్చి సోహైల్‌ని ఆటపట్టించారు. తర్వాత అఖిల్‌ని ఇంప్రెస్‌ చేసే పనిలో పడింది మోనాల్‌. హ్యాపీ టు సీ యు అని మోనాల్ అనగానే దీనికేం తక్కువలేదు అంటూ సెటైర్ వేశాడు అఖిల్.

తర్వాత అవినాష్‌ని ఏడిపించేందుకు అరియానాతో అఖిల్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మేం ఫ్రెండ్స్.. ఇంకా క్లోజ్ అవుతున్నాం. నా బరువు మోయడానికి రెడీగా ఉంది అంటూ ఏడిపించే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో దెయ్యం జలజ…మరోసారి అరియానాను బెంబేలెత్తించింది.

దమ్ముంటే నీ ముఖం మళ్లీ చూపించు అంటూ దెయ్యంతో సవాల్ చేసింది హారిక. అవినాష్ అయితే నీకు పెళ్లైందా? అంటూ దెయ్యంతో జోక్‌లు వేశాడు. సోహైల్ సైతం దెయ్యంతో ఆడుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత దెయ్యం ఇంటి సభ్యులని సోఫా దగ్గరకు రండి అని తెలిపింది.నేను చాలా కోపంగా ఉన్నాను.. నేను బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాన్ని.. నా పేరు జలజ. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తానని బిగ్ బాస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. నాకు బిగ్ బాస్ ఇంటి నియమాలు అంటే చాలా కష్టం.. వాటిని ఉల్లంఘిస్తే కోపం వస్తుందని తెలిపింది.

తొలుత అభిజిత్ ఇంటిలో ఉన్న చెట్టు ఆకులు మొత్తం లెక్క పెట్టాలని టాస్క్ ఇవ్వగా సోహైల్‌ని పాటవచ్చిన ప్రతిసారి షర్ట్ విప్పి డ్యాన్స్ చేయాలని తెలిపింది. తర్వాత అభిజిత్, అఖిల్‌లు కలిసి మోనాల్‌ని చాలా ఏడిపించారు. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు మోనాల్ డేట్‌కి తీసుకుని వెళ్లాలని సూచించాడు బిగ్ బాస్.

దీంతో అభిజిత్ అప్‌సెట్ అయ్యాడు. మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నా.. మళ్లీ డేట్ ఏంటి?? నేను తనని ఏడిపించడం ఏంటి?? నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు అంటూ తెలిపాడు. ప్రతిసారీ మోనాల్ టాపిక్ వచ్చిందంటే నాకు రాడ్ పడుతుంది. నేను మోనాల్‌తో డేట్‌కి పోను బిగ్ బాస్ అంటూ తెలిపాడు.

దీంతో బిగ్ బాస్ ఎంటరై.. ఇది బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్.. దీనిలో భాగంగా టాస్క్‌లు చేయడం మీ బాధ్యత అని.. అభిజిత్ నిరాకరించిన కారణంగా అఖిల్ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ తర్వాత తొలిసారి హౌస్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు అభి.తర్వాత మోనాల్‌తో కలిసి డేట్‌కి వెళ్లిన అఖిల్ తనలోకి కమల్ హాసన్‌ని నిద్రలేపాడు. ఐ యామ్ అఖిల్ అంటూ మోనాల్‌తో ప్రేమగా చెప్పగా తర్వాత నందికొండ వాగుల్లోనా సాంగ్‌ రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు.