బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 80 హైలైట్స్

69
episode 80

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 80 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 80వ ఎపిసోడ్‌లో భాగంగా అవినాష్‌ బంపర్ ఆఫర్ కొట్టేయగా అఖిల్‌కి నిరాశే ఎదురైంది.సోమవారం నామినేషన్ ఎపిసోడ్‌ హౌస్‌లో కంటిన్యూ అవుతూనే ఉంది. నేను టాస్క్‌లు ఆడనే ఆడను.. నా వేలో నేను ఆడతా.. ఇప్పుడు పెట్టండి టాస్క్‌లు అంటూ అవినాష్ కోపంతో చెబుతూనే అరియానాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక అఖిల్ అయితే అభిజిత్ నామినేషన్స్ నుంచి సేవ్ కావడంతో తెగ ఫీల్ అయిపోయాడు.

తనని నామినేట్ చేసి అభిజిత్‌ని సేవ్ చేయడం పట్ల ఎమోషనల్ అయ్యింది మోనాల్. నేను చాలా సందర్భాల్లో అఖిల్ స్ట్రాంగ్ అని చెప్పాను.. ఆ నలుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని అంటే అఖిల్‌ని చేయొచ్చు అని నాకు తెలుసు. కానీ నువ్ అలా చేయలేదని హారికతో చెబుతూ బాధ పడింది మోనాల్.నువ్ స్వాప్ చేయమన్నది రైట్ పర్శన్‌తో అన్నావ్.. అంటే అది అఖిల్‌తో చేయమన్నావా? అని మోనాల్‌ని అడిగింది హారిక. అవును అని చెప్పడంతో..సారీ మోనాల్ నేను అది తెలుసుకోలేక అభిజిత్‌ని సేవ్ చేశా అని సింపుల్‌గా అనేసింది.అయితే అఖిల్ మాత్రం తెగ ఫీల్ అయిపోయి మోనాల్ వైపు కనీసం చూడలేదు.

అభిజిత్ సేవ్ కావడాన్ని తప్పుపడుతూ సొహైల్ దగ్గర తెగ ఫీల్ అయ్యాడు అఖిల్. నేను మోనాల్‌తో మాట్లాడినప్పుడు నన్ను స్వాప్ చేయమని ఎక్కడా అడగలేదు.. కానీ ఈ మనిషి (అభి) ఇన్ని మాటలు మాట్లాడతాడు.. నేను ఒకర్ని తొక్కి రావాలని అనుకోవడం లేదని చెప్తాడు.. మరి స్వాప్ ఇచ్చినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు వద్దు అని ఒక్క మాట అంటే ఏమౌతుంది. ఏం గేమ్ ఇది అని తెగ ఫీల్‌ అయ్యాడు. తర్వాత అభికి మోనాల్ సారీ చెప్పడంతో గొడవ ముగిసిపోయింది.

ఇంటి సభ్యులు ఫినాలేకి అతి చేరువలో ఉండటంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ రూపంలో నామినేట్ అయిన సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఫ్రీ పాస్ పొందిన సభ్యుడు ఎవిక్షన్ నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. దీనిలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో కొన్ని బిగ్ బాస్ జెండాలు వివిధ ప్రదేశాల్లో పెట్టారు. వాటిలో ఎక్కువ జెండాలను ఎవరు సేకరిస్తే వాళ్లు రెండవ లెవల్‌కి చేరుకోవచ్చని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.అఖిల్ 35, అరియానా 17, అవినాష్ 28, మోనాల్ 20 జెండాలను దక్కించుకున్నారు.

ఎక్కువ జెండాలు సేకరించిన అఖిల్, అవినాష్‌లు లెవల్ 2కి నామినేట్ అయ్యారు. ఇందులో భాగంగా అఖిల్, అవినాష్‌లు కాంపెయిన్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇంటి సభ్యులు తమ వద్ద దండల్ని మద్దతు తెలుపుతున్న సభ్యుల మెడలో వేసి వారి మద్దతు తెలపాల్సి ఉంటుందని .. ఏ సభ్యుని మెడలో ఎక్కువ దండలు ఉంటాయో ఆ సభ్యునికి ఎవిక్షన్ ప్రీ పాస్ లభిస్తుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో హారిక చివరగా అవినాష్‌కు మద్దతు తెలపడంతో అవినాష్ గెలుపొందారు.

ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌కి రెండు వారాల వాలిడిటీ ఉంటుందని మీరు దీన్ని ఈ రెండు వారాల్లో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్. మొత్తానికి హారిక దయతో నామినేషన్స్ నుంచి సేవ్ అయిన అవినాష్.. తాను బయటకు వెళ్లినా హారికను గుర్తుపెట్టుకుంటానని అమ్మ అని పిలుస్తా అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక చివరగా అరియానాకు దెయ్యం కనిపించి షాకివ్వగా గట్టిగా అరుస్తూ ఇంటి సభ్యులను పిలిచింది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఆ దెయ్యం ఎవరనేది తెలియనుంది.