బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 68 హైలైట్స్‌

152
episode 68
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 68 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 68వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యలు ఇప్పటివరకు ఎవరితో షేర్ చేయని సీక్రెట్‌లు చేసుకోగా వారి ఇంటి లేక రూపంలో వచ్చిన మెస్సేజ్‌లు చూసి ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యారు.

తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌లో భాగంగా సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో పాటు ఇంటి సభ్యులు డ్యాన్స్ చేశారు. తర్వాత కెమెరాలతో మాట్లాడిన అఖిల్ ఇంట్లో అందరూ గేమ్ ఆడుతున్నారు..స్టార్టింగ్ రోజు ఏ ఫీలింగ్ అయితే ఉందో ప్రతిరోజు అలాగే ఉంది. బయట ఉండే మనిషిలోని రియాలిటీ తెలుసుకోవడం కష్టం కానీ.. ఒకే ఇంట్లో ఉంటే ఈజీగా రియాలిటీ చూడొచ్చు అని తెలిపారు అఖిల్.

అభిజిత్-సొహైల్-మెహబూబ్‌ల మధ్య అఖిల్ గురించి చర్చ జరిగింది. ఆయన స్ట్రాంగ్ ప్లేయర్ అని పంపించేశారని అనుకున్నాడు తప్పితే.. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే.. ఈ ఇంట్లో అర్హత లేని వాళ్లు అని….ఎవరైతే ఫిట్ అవ్వడం లేదో.. హౌస్‌లో ఉండాలని అనుకోవడం లేదో.. ప్రేక్షకులు కూడా బయటకు పంపాలని అనుకుంటున్నారో.. అని చూడాలి అభిజిత్ తెలపగా అఖిల్ కౌంటర్ వేస్తూనే ఉన్నారు.

మొదటి నుంచి చూసుకుంటే.. బోటులో నుంచి దిగనోడు.. కెప్టెన్సీ కోసం కొట్లాడిన వాడు. హౌస్ ఇమ్యునిటీ కోసం వారం పాటు కొట్లాడిన వాడు.. డిఫెండ్ చేయకుండా ఎట్లా పోయాడు ఆశ్చర్యం వేస్తుంది అని తెలిపాడు అభి. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా వచ్చిన మటన్‌ని ఫ్రిడ్జ్‌లో సరిగా పెట్టకపోవడంతో అది పాడైంది. దీంతో ఇంటి సభ్యులు తెగ బాధపడిపోయారు. అవినాష్‌ను టార్గెట్ చేస్తూ ఆటాడుకున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌లో అంతా అవినాష్‌ పేరు చెబుతామని ఆటపట్టించారు. కిలో మటన్ కోసం వీళ్లు నామినేట్ చేసేలా ఉన్నాళ్లు ప్లీజ్ బిగ్ బాస్ అంటూ తెగ బ్రతిమిలాడాడు.

ఇంటి సభ్యులకు బహుమతులు ఇచ్చే అవకాశం సీక్రెట్‌ రూంలో ఉన్న అఖిల్‌కి కల్పించారు బిగ్ బాస్. ఇంటి సభ్యులు అందరి కోసం ఆప్తుల దగ్గర నుంచి సందేశాలు లేఖలు ద్వారా వచ్చాయని.. వాటిని ఇంటి సభ్యులకు ఇవ్వాలా? వద్దా?? అనే నిర్ణయం మీ చేతుల్లో ఉందని.. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా కన్వెషన్ రూంకి వచ్చి వారి జీవితంలో జరిగిన అతిపెద్ద రహస్యాన్ని చెప్తారని. వాటిని విన్న తరువాత ఇంటి సభ్యులకు లేఖ పంపించాల్సి ఉంటుందని తెలిపాడు. టాస్క్ విజయ వంతంగా కంప్లీట్ చేస్తే మీకు కూడా లేఖ వస్తుందని తెలిపారు.

మొదటిగా మెహబూబ్ తన జీవితంలో జరిగిన రహస్యం చెప్పాడు. దీంతో కన్విన్స్ అయిన అఖిల్ లేఖను పంపించాడు. ఇక లాస్య తన లవ్ సీక్రెట్‌ని రివీల్ చేయగా హారిక నాలుగున్నరేళ్లు రిలేషన్‌లో ఉన్నానని తన లవ్‌ సీక్రెట్‌ని రివీల్ చేసింది. అభిజిత్,సొహైల్‌లకు లేఖ పంపిన అఖిల్….అవినాష్,హారికలకు మాత్రం లేఖ పంపలేదు. ఇక చివరగా తన లేఖ పంపాలని బిగ్ బాస్‌ని బ్రతిమిలాడారు అఖిల్. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -