సీఎం కేసీఆర్‌తో అసద్ భేటీ…గ్రేటర్ ఎన్నికలపై చర్చ

46
cm kcr

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గురువారం రాత్రి తానే స్వయంగా ప్రగతి భవన్‌కు కారు డ్రైవ్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా వీరి మధ్య గ్రేటర్ ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇప్పటికే ఇంఛార్జీలను నియమించింది టీఆర్ఎస్‌. గత ఎన్నికల్లో 99 డివిజన్లు కైవసం చేసుకుని సత్తా చాటిన టీఆర్‌ఎస్‌.. ఈసారి సెంచరీ కొట్టాలని పట్టుదలగా అడుగులు వేస్తోంది.

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి మరుసటిరోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.